దేశవ్యాప్తంగా టెలికాం సేవలందిస్తున్న ఎయిర్టెల్ సంస్థ (Airtel ) వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తాజాగా రూ.189 కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను విడుదల చేసింది. ఈ ప్లాన్ ముఖ్యంగా ఇంటర్నెట్ ఉపయోగం తక్కువగా ఉండే వినియోగదారుల కోసం రూపకల్పన చేయబడింది. ముఖ్యంగా పెద్దవారికి లేదా కేవలం నంబర్ యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.
ప్లాన్‌లోని ప్రధాన ఫీచర్లు
రూ.189 ప్లాన్‌కి 21 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. ఇందులో అన్ని నెట్‌వర్క్‌లకు అపరిమిత వాయిస్ కాల్స్, 1GB మొబైల్ డేటా, 300 SMSలు లభిస్తాయి. డేటా వాడకాన్ని పెద్దగా అవసరం లేని వినియోగదారుల కోసం ఇది సరైన ఎంపికగా కనిపిస్తోంది. వాయిస్ కాల్స్ మరియు మెసేజింగ్ ప్రధాన అవసరంగా ఉన్న వారికి ఇది కాస్ట్ ఎఫెక్టివ్ ప్లాన్ గా నిలవనుంది.
అధిక డేటా వినియోగదారులకు మినహాయింపు
అయితే, రోజూ ఎక్కువగా డేటా వాడే యూజర్లకు ఈ ప్లాన్ తక్కువ ప్రయోజనం కలిగించగలదు. ఎందుకంటే ఇందులో కేవలం 1GB డేటా మాత్రమే లభిస్తుంది. ఇంటర్నెట్ ఆధారిత యాప్‌లు, వీడియో స్ట్రీమింగ్ లేదా వర్క్ ఫ్రమ్ హోమ్ అవసరాలున్నవారు ఇతర డేటా ప్లాన్‌లను పరిశీలించవలసి ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే, కాల్స్ కోసం మాత్రమే మొబైల్‌ను ఉపయోగించే వారికి ఇది మంచి ఆప్షన్.
Read Also : Earthquake : ఢిల్లీలో 4.4 తీవ్రతతో భూకంపం