📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Internet-అఫ్గానిస్తాన్ లో షట్‌డౌన్ తో స్తంభించిన లావాదేవీలు

Author Icon By Vanipushpa
Updated: October 1, 2025 • 4:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తాలిబాన్(Taliban) సుప్రీం లీడర్(Suprem Leader) ఆదేశంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌ (Internet), మొబైల్‌ ఫోన్లు, ల్యాండ్‌లైన్లు సహా అన్ని డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి అఫ్గానిస్తాన్‌(Afghanistan)లో దేశీయ, అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు. ఈ ఆదేశం వల్ల ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకులు, విమానాలు, రోడ్డు రవాణా అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. వైద్య సహాయం, నగదు లావాదేవీలు, ప్రయాణం వంటి సాధారణ అవసరాలకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఫ్గాన్ తెలిపింది.

Internet-అఫ్గానిస్తాన్ లో షట్‌డౌన్ తో స్తంభించిన లావాదేవీలు

అధికారికంగా వెల్లడించని తాలిబాన్

ఈ నిర్ణయానికి కారణమేంటో తాలిబాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ షట్‌డౌన్ మరింతకాలం కొనసాగుతుందేమోననే భయాలు ఉన్నాయి. శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలకు కూడా అంతరాయం ఏర్పడటంతో కాబుల్‌లోని తమ కార్యాలయాలతో సంబంధం కోల్పోయామని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి. తాలిబాన్ సుప్రీం లీడర్ ఆదేశంతో దేశవ్యాప్తంగా ఇంటర్నెట్‌, మొబైల్‌ ఫోన్లు, ల్యాండ్‌లైన్లు సహా అన్ని డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థలు పూర్తిగా నిలిచిపోయాయి. సెప్టెంబర్ 29వ తేదీ సాయంత్రం నుంచి అఫ్గానిస్తాన్‌లో దేశీయ, అంతర్జాతీయ కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు బయటి ప్రపంచంతో సంబంధం కోల్పోయారు.

షట్‌డౌన్ మరింతకాలం కొనసాగుతుందా?

ఈ ఆదేశం వల్ల ఆరోగ్య కేంద్రాలు, బ్యాంకులు, విమానాలు, రోడ్డు రవాణా అన్ని పూర్తిగా నిలిచిపోయాయి. వైద్య సహాయం, నగదు లావాదేవీలు, ప్రయాణం వంటి సాధారణ అవసరాలకు కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అఫ్గాన్ తెలిపింది. ఈ నిర్ణయానికి కారణమేంటో తాలిబాన్ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ఈ షట్‌డౌన్ మరింతకాలం కొనసాగుతుందేమోననే భయాలు ఉన్నాయి. శాటిలైట్ టెలివిజన్ ప్రసారాలకు కూడా అంతరాయం ఏర్పడటంతో కాబుల్‌లోని తమ కార్యాలయాలతో సంబంధం కోల్పోయామని అంతర్జాతీయ న్యూస్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

పూర్తిగా బ్లాక్ అవుట్

ఆఫ్ఘనిస్తాన్ ఎందుకు పూర్తిగా బ్లాక్ అవుట్ అయింది. ఈ బ్లాక్ అవుట్ ఉద్దేశపూర్వకంగానే జరిగిందని, సాంకేతికలోపం కాదని గ్లోబల్ ఇంటర్‌నెట్ వాచ్‌డాగ్ నెట్‌బ్లాక్స్ ధృవీకరించింది. ఇంటర్నెట్ సేవల కోసం ఒక భవనం పైకప్పుపై ఏర్పాటు చేసిన టెలికాం పరికరాల పక్కన తాలిబాన్ జెండా ఎగురుతోంది. అయితే ఇప్పటివరకు, తాలిబాన్ ప్రభుత్వం దీనిగురించి ఎటువంటి అధికారిక ప్రకటనా విడుదల చేయలేదు. ఇది నిరంతరాయంగా కొనసాగుతుందేమోననే భయాలు ఉన్నాయి. సెప్టెంబర్ 16న, బాల్ఖ్, కాందహార్, హెల్మాండ్ వంటి కొన్ని ప్రావిన్స్‌లలో ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్‌ను నిషేధించినప్పుడు, “అనైతికతను నివారించడానికి” సుప్రీం లీడర్ మౌల్వి హైబతుల్లా అఖుంద్‌జాదా ఇలా ఆదేశించారని పేరు చెప్పడానికి ఇష్టపడని పలువురు తాలిబాన్ అధికారులు తెలిపారు.

ఈ షట్‌డౌన్ ప్రభావం ఎంత?

అఫ్గానిస్తాన్లో స్థానిక, అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయాయి. అలాగే బ్యాంకులు, ఎలక్ట్రానిక్ ఐడీ సిస్టమ్స్, పాస్‌పోర్ట్ కార్యాలయాలవంటివి హై-స్పీడ్ ఫైబర్-ఆప్టిక్ ఇంటర్నెట్‌పై ఆధారపడి ఉంటాయి. ఇప్పుడవి సరిగా పనిచేయడంలేదు. “ఇంటర్నెట్ షట్‌డౌన్ కారణంగా అన్ని ఫ్లైట్లను తాత్కాలికంగా నిలిపివేశాం. పరిస్థితి మెరుగుపడిన తర్వాత తాజా సమాచారం అందిస్తాం” అని అఫ్గానిస్తాన్‌లోని అతిపెద్ద ప్రైవేట్ ఎయిర్‌లైన్లలో ఒకటైన కామ్ ఎయిర్ సంస్థ వెల్లడించింది.
రాజధానిలోని బ్యాంకులు తెరిచి ఉన్నప్పటికీ, చాలా రద్దీగా ఉన్నాయి. పరిమిత నగదు మాత్రమే అందుబాటుతో ఉండడంతో ప్రజలు నగదు కోసం బారులు తీరారు.

ఆఫ్ఘనిస్తాన్ దేనికి ప్రసిద్ధి చెందింది?
సామ్రాజ్యాలు మరియు సంస్కృతుల కూడలిగా దాని గొప్ప చరిత్ర, దాని అందమైన చేతితో నేసిన తివాచీలు మరియు మణి కుండలు, బామియన్ యొక్క ధ్వంసమైన బుద్ధులు మరియు బాండే అమీర్ సరస్సులు వంటి పురాతన చారిత్రక ప్రదేశాలు, లిథియం మరియు రాగి వంటి సహజ వనరుల గణనీయమైన నిల్వలు మరియు దాని జాతీయ క్రీడ బుజ్కాషికి ఆఫ్ఘనిస్తాన్ ప్రసిద్ధి చెందింది.

ఆఫ్ఘనిస్తాన్ పేద దేశమా లేక ధనిక దేశమా?
ఆఫ్ఘనిస్తాన్ ఒక పేద దేశం, దాని జనాభాలో సగానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు, అయినప్పటికీ విస్తారమైన సహజ వనరులు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

afghanistan Banking System Government Services Latest News Breaking News Shutdown Economic Crisis Financial Transactions Banking System Government Services Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.