📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Abhishek Banerjee: కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం

Author Icon By Shobha Rani
Updated: June 28, 2025 • 5:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కోల్‌కతా(Kolkata)లో లా విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన రాజకీయ దుమారం రేపుతున్నది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)(TMC), ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ (బీజేపీ) (BJP) మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. ఈ ఘటనలో ప్రధాన నిందితులకు అధికార పార్టీ నేతలతో దగ్గరి సంబంధాలున్నాయని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. నిందితుల్లో ఒకరైన మనోజిత్ మిశ్రా(Manojit Misra) .. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) మేనల్లుడు అభిషేక్ బెనర్(Abhishek Banerjee) జీ, ఆరోగ్య మంత్రి చంద్రమ భట్టాచార్య వంటి టీఎంసీ కీలక నేతలతో కలిసి దిగిన ఫొటోలను బీజేపీ ఐటీ విభాగం చీఫ్ అమిత్ మాలవీయ, జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అభిషేక్ బెనర్జీతో ఫోటోలు వైరల్
మమతా బెనర్జీ (Mamata Benarjee) పాలనలో బెంగాల్ మహిళలకు పీడకలగా మారిందని, మమత ప్రభుత్వం మరోసారి నిందితుల పక్షాన నిలబడిందని ప్రదీప్ భండారీ (Pradeep Bhandaari) ఆగ్రహం వ్యక్తంచేశారు. మనోజిత్ మిశ్రా ఒక టీఎంసీ సభ్యుడని, ఆర్జీ కర్ అత్యాచారం కేసులో అయినా, ఈ కేసులో అయినా నిందితులను కాపాడటంలోనే టీఎంసీ ముందుంటోందని ఆరోపించారు. ఈ దారుణంపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, ఎవరిని కాపాడాలని చూస్తోందని అమిత్ మాలవీయ ప్రశ్నించారు.
టీఎంసీ కౌంటర్ – ‘‘రాజకీయం చేయవద్దు’’
బీజేపీ ఆరోపణలపై టీఎంసీ నేత శశి పంజా (Shashi panjaa) శుక్రవారం తీవ్రంగా స్పందించారు. ఈ దారుణ ఘటనను రాజకీయం చేయవద్దని ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ “ఈ సంఘటన చాలా బాధాకరం. అయితే బీజేపీ నేతలు దీనిపై సానుభూతి చూపాల్సింది పోయి, నిందితుల మతం, పేర్లు చూస్తూ ఫొటోలు ప్రదర్శిస్తున్నారు” అని విమర్శించారు.
శశి పంజా స్పందన
ఫిర్యాదు అందిన 12 గంటల్లోనే పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారని, వారి ఫోన్లు స్వాధీనం చేసుకుని, బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారని శశి పంజా వివరించారు. కోల్‌కతా పోలీసులు స్పందించిన వేగాన్ని బీజేపీ ఊహించలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి వేగవంతమైన చర్యలు కనిపించవని విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించారు.

Abhishek Banerjee: కోల్‌కతాలో న్యాయ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం


నిందితులు పోలీస్ కస్టడీలో
ఈ కేసుకు సంబంధించి పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో కాలేజీ మాజీ విద్యార్థి మనోజిత్ మిశ్రా (31), ప్రస్తుత విద్యార్థులు జైబ్ అహ్మద్ (19), ప్రమిత్ ముఖర్జీ (20) ఉన్నారు. నిందితులను అలీపూర్ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జులై 1 వరకు పోలీస్ కస్టడీ విధించింది. బాధితురాలి వైద్య నివేదికలో ఆమె శరీరంపై గాయాలు, గోటి గీతలు ఉన్నాయని, బలవంతపు లైంగిక దాడి జరిగినట్టు నిర్ధారణ అయిందని పోలీసులు తెలిపారు.
10 నెలల క్రితం జరిగిన దారుణం
కాగా, సుమారు 10 నెలల క్రితం జరిగిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థినిపై లైంగిక దాడి, హత్య ఘటనను ఈ ఉదంతం గుర్తుచేస్తోంది. ఆ కేసులో కూడా రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ ఘటనలో దోషిగా తేలిన సంజయ్ రాయ్ అనే సివిక్ వాలంటీర్‌కు కోర్టు జీవిత ఖైదు విధించిన విషయం తెలిసిందే.

Read Also:

Read Also: Karnataka: కర్ణాటక పులుల మృతిపై వీడిన మిస్టరీ

Abhishek Banerjee: AparajitaBill Breaking News in Telugu CampusSafety Google news Google News in Telugu JusticeForStudent KolkataLawCollegeRape Latest News in Telugu Law student gang-raped in Kolkata Paper Telugu News StopCampusViolence StudentProtests Telugu News Telugu News Paper Telugu News Today TMCvsOpposition Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.