📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు కెనరా బ్యాంక్ కొత్త యాప్

రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ కొత్త ప్రాజెక్టు

Author Icon By sumalatha chinthakayala
Updated: January 8, 2025 • 9:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్‌: దిగ్గజ రియాల్టీ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ రూ.4500 కోట్ల పెట్టుబడులతో హైదరాబాద్‌లొ కొత్త ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రకటించింది. కోకపేట్లోని నియోపోలిస్ సమీపంలో 10 ఎకరాల్లో ‘బ్రిగేడ్ గేట్వే’ పేరుతో నివాస, వాణిజ్య అవసరాలను తీర్చేలా నిర్మాణ పనులు చేపడుతున్నామని ఆ కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అమర్ మైసోర్ వెల్లడించారు. బుధవారం హైదరాబాద్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే నగరంలో రెండు ప్రాజెక్టులను పూర్తి చేశామని.. తాజా బ్రిగేడ్ గేట్వేలో నివాసాలు, వాణిజ్య సముదాయాలు, హోటళ్లను అందుబాటులోకి తేనునామన్నారు.

image

“45 లక్షల చదరపు అగుడుల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును అందుబాటులోకి తెస్తున్నాము. ఇందులో 25 లక్షల చదరపు అడుగుల్లో లగ్జరీ నివాసాలను అందుబాటులోకి రానున్నాయి. భూమి, నిర్మాణం కోసం రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాము” అని అమర్ మైసోర్ తెలిపారు. ఈ నిధులను ఈక్విటీ, ఫైనాన్స్, కొనుగోలుదారుల నుంచి సమీకరించనున్నామన్నారు. 600 ఫ్లాట్లను అందుబాటులోకి తేనున్నామని.. 3,4,5 పడక గదుల శ్రేణిలోని వీటి ధరలను రూ.4 కోట్లు – రూ.12 కోట్ల మధ్య ఉంటాయన్నారు. నివాస టవర్లను 212 మీటర్ల ఎత్తులో ఉ ంటాయని తెలిపారు. అదే విధంగా మరో 20 చదరపు అడుగుల విస్తీర్ణంలో వాణిజ్య టవర్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మాల్, 10 లక్షల చ.అ ల్లో | ఆఫీసు స్పేస్, 300 కీస్ ఇంటర్నేషనల్ హోటల్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆఫీసు స్పేస్ను వాల్డ్ ట్రేడ్ సెంటర్ బ్రాండ్పై ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Brigade Enterprises Brigade Gateway commercial needs Residential

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.