📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా!

Latest Telugu News: Crime-ఎంతపని చేసారు!..పెళ్లి చేసుకున్న ప్రేమజంట ఆత్మహత్య

Author Icon By Vanipushpa
Updated: October 1, 2025 • 11:31 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నఓ ప్రేమజంట(love-couple) తమ పెళ్లిని‌ పెద్దలు అంగీకరించలేదని దారుణమైన నిర్ణయం తీసుకుంది. రైల్వేట్రాక్‌పై ఆ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. జిల్లాలోని పేరేచర్ల రైల్వే ట్రాక్‌పై ఆ జంట ఆత్మహత్య(lovers-suicide)కు పాల్పడింది. ప్రేమికులిద్దర్ని గోపి, ప్రియాంకగా గుర్తించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం దమ్మాలపాడుకు చెందిన గోపి తెనాలి మండలం అత్తోటకు చెందిన లక్ష్మీ ప్రియాంకలు నరసరావుపేటలోని ఎన్ఆర్ఐ కాలేజీలో ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నారు.

నెల 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు
గోపి, లక్ష్మీ ప్రియాంక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం ఇరువురు తల్లిదండ్రులకు తెలిపారు. కానీ వాళ్లు ఒప్పుకోలేదు. దీంతో ఇరువురు ఈ నెల 5వ తేదీన పెళ్లి చేసుకున్నారు. అనంతరం పట్టాభిపురం పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరువైపుల పెద్దలను పిలిపించి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. కానీ, రెండు వైపులా పెద్దలు వీరి పెళ్ళిని అంగీకరించలేదు. దీంతో ప్రేమికులు ఇద్దరు మనస్తాపానికి గురయ్యారు. రెండు రోజుల క్రితం గోపి ఇంటినుంచి వెళ్లిపోయి పేరేచర్ల సమీపంలో రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మీ ప్రియాంక తీవ్ర మనస్థాపానికి గురైంది. మరుసటి రోజు ఆమె అదే రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యకు పాల్పడింది. కలిసి బతకలేమనే మనస్థాపంలో గోపి, ప్రియాంక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మృతదేహాలను గుర్తించిన రైల్వే పోలీసులు వాటిని పోస్టుమార్టం కోసం నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు . ఈ సూసైడ్ పై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమికుల ఆత్మహత్యతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.