📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Ipo: ఈ వారం ఈక్విటీ మార్కెట్‌కు 6 ఐపీఓలు

Author Icon By Shobha Rani
Updated: June 16, 2025 • 11:54 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఈ వారం 6 కొత్త పబ్లిక్ ఇష్యూలు (IPOs) ఈక్విటీ మార్కెట్‌లో సందడి చేయనున్నాయి. వీటిలో ఒకటి మెయిన్ బోర్డ్ ఐపీఓ(Ipo), మిగిలిన 5 సంస్థలు SME విభాగంలోకి వస్తున్నాయి. ఇదే సమయంలో, గతంలో వచ్చిన ఐపీఓల షేర్లు కూడా ఈ వారం మార్కెట్‌లో లిస్టింగ్‌కి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఐపీఓకు వచ్చిన మరో 5 కంపెనీల షేర్లు, ఈ వారమే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కానున్నాయి.
మెయిన్ బోర్డ్ ఐపీఓ
స్థిరాస్తి సంస్థలు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలపర్లు, కాంట్రాక్టర్లకు నిర్మాణ సామగ్రిని సరఫరా చేస్తున్న ఏరిస్‌ఇన్‌ఫ్రా సొల్యూషన్స్‌ ఐపీఓ ఒక్కటే మెయిన్‌ బోర్డ్‌ ఐపీఓ. పూర్తిగా తాజా షేర్ల జారీ ద్వారా రూ.499.60 కోట్లను ఈ కంపెనీ సమీకరించబోతోంది. ఇష్యూ ఈ నెల 20న ప్రారంభం కానుంది. ఇష్యూ ధరల శ్రేణి రూ.210-222.
SME విభాగంలో రాబోతున్న ఐపీఓలు
ఎస్‌ఎంఈ విభాగంలో పాటిల్‌ ఆటోమేషన్, సమయ్‌ ప్రాజెక్ట్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూలు ఈనెల 16-18 తేదీల్లో రాబోతున్నాయి. ఎప్పెల్‌టోన్‌ ఇంజినీర్స్‌ ఐపీఓ 17న, మాయాషీల్‌ వెంచర్స్‌ ఐపీఓ 20న ప్రారంభం కాబోతున్నాయి. ఇన్‌ఫ్లక్స్‌ హెల్త్‌టెక్‌ ఐపీఓ ఈనెల 18-20 తేదీల్లో జరగనుంది.
లిస్టింగ్‌కి సిద్ధమైన కంపెనీలు
ఓస్వాల్‌ పంప్స్‌ ఐపీఓ ఈ నెల 17న ముగియనుండగా, ఈ షేరు 20న ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదు కానుంది. మోనోలిథిస్చ్‌ ఇండియా ఐపీఓ 16న ముగియనుండగా, 19న షేరు నమోదు కానుంది. అటెన్‌ పేపర్స్‌ అండ్‌ ఫోమ్స్‌ ఐపీఓ 17న ముగియనుండగా, 20న బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై నమోదు కానుంది. సచీరోమ్‌ షేరు 16న, జైనిక్‌ పవర్‌ అండ్‌ కేబుల్స్‌ 17న ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్‌ ప్లాట్‌ఫామ్‌పై నమోదు కానున్నాయి.

Ipo: ఈ వారం ఈక్విటీ మార్కెట్‌కు 6 ఐపీఓలు

ఐపీఓలో పెట్టుబడి పెట్టేముందు DRHP (Draft Red Herring Prospectus) చదవడం అవసరం. కంపెనీ బిజినెస్ మోడల్‌, ఫైనాన్షియల్స్‌, ప్రస్తుత మార్కెట్ పరిస్థితులపై అవగాహన అవసరం. మెయిన్ బోర్డ్ ఐపీఓలతో పాటు SME విభాగంలోని IPOలు కూడా వృద్ధి అవకాశాలతో కూడుకున్నవే కాని, అవి సాధారణంగా అధిక మిగులు/నష్టాలకు లోనవ్వగలవు.

Read Also: Stock market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు

6 IPOs to hit the Breaking News in Telugu equity market this week Google news Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.