📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

భూముల ధరలపై పునరాలోచనలో ఏపీ ప్రభుత్వం

Author Icon By Digital
Updated: December 28, 2024 • 10:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయం వాయిదా

విజయవాడ : రాష్ట్రంలో భూముల మార్కెట్ ధరలు పెంచాలన్న నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం పునరాలోచనలో పడింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి భూముల మార్కెట్ ధరలను పెంచాలన్న నిర్ణయాన్ని వాయిదా వేసింది. అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లలో అనేకసార్లు భూముల మార్కెట్ ధరలను పెంచారు. దీని వల్ల ప్రజలు, సామాన్యులపై ఎనలేని భారం పడింది. నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక భూముల రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం పెంచుకునేందుకు మార్కెట్ ధరలు పెంచాలని ప్రభుత్వంపై అధికారులు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారు. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రజలు ఇతిబాధలు పట్టించుకోకుండా ఆదాయం పెంపే లక్ష్యంగా ఏకంగా ఏటా 14వేల కోట్ల రెవెన్యూ చూపించేలా ప్రతిపాదనలు చేశారు. దీనిపై ఆర్థికశాఖ గంపెదాశలు పెట్టుకుంది. ఇది అమలైతే ఒక్క రిజిస్ట్రేషన్ల ద్వారానే ఏలా 14వేల కోట్ల ఆదాయం వస్తుందని, కాబట్టి భూముల మార్కెట్ ధరలు పెంచేందుకు అనుమతించాలని ఆర్థికశాఖ, రెవెన్యూశాఖల అధికారులు ముఖ్యమంత్రి వద్ద పట్టుబట్టారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 2025 జనవరి 1 నుంచే భూముల మార్కెట్ ధరలు పెంచాలని తొలుత నిర్ణయించింది. దీనిపై ప్రజుల్లో కొంత ఆందోళన, అంబడి గెలకొన్నాయి. భూముల ధరలు పెంచారని ప్రభుత్వాన్ని కోరుతూ ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ అంశం పై మరోసారి సమగ్రంగా చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుందామని, జనవరి నుంచి భూముల మార్కెట్ ధరల పెంపు నిర్ణయం అమలును వాయిదావేయాలని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. ఈనెల 30న మంగళగిరిలోని సీసీఎల్ ఏ కార్యాలయంలో జోనల్ రెవెన్యూ సమావేశం జరగమంది. అచెరోజు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామని మంత్రి అనగాని ఆంధ్రజ్యోతికి చెప్పారు. “మాది ప్రజా ప్రభుత్వం. వారికి కష్టం కలిగేలా ఏకవర్ల నిర్ణయాలు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతకు ముందే ప్రజలకు సామీ ఇచ్చారు. కాబట్టి రూముల మార్కెట్ ధరలు పెంచాలన్న అంశంపై మరోసారి అధికారులతో చర్చించాలనుకున్నాం. రెవెన్యూ సదస్సులో రెండో సెషన్ తర్వాత రజిస్ట్రేషన్ ఐజీలతో సమావేశం నిర్వహించి తాజా పరిస్థితిపై వారిచ్చే నివేదికలపై చర్చిస్తాం. ఆ త ర్వాత సీఎంకు ని వేదిస్తాం అని అనగాని స్పష్టం చేశారు. ఇప్పటికే నిమా విభాగం కూడా ఈ అంశంపై నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. “రాష్ట్రంలో ఒకవైపు రెవెన్యూ సరస్సులు గ్రామగ్రామాన జరుగుతున్నాయి. ప్రభుత్వం తమ సమస్యలు తీరుస్తుందన్న నమ్మకంతో ప్రజలు భారీగా తరలివచ్చి సరస్సుల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈ తరుణంలో భూముల మారె ధరలు పెంచడం ప్రతికూల ప్రభావం చూపిస్తుంది అని నిఘా విభాగం ప్రభుత్వానికి సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది

AndhraPradesh Ap Chandrababu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.