📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

జ‌మిలి బిల్లుకు టీడీపీ మ‌ద్ద‌తు: అమిత్ షా

Author Icon By Vanipushpa
Updated: December 17, 2024 • 2:42 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

లోక్‌స‌భ‌లో ఈరోజు ప్ర‌వేశ‌పెట్టిన జ‌మిలి ఎన్నిక‌ల బిల్లుకు తెలుగుదేశం పార్టీ మ‌ద్ద‌తు ప‌లికింది. దేశ‌వ్యాప్తంగా నిర్వ‌హించే ఎన్నిక‌ల విధానం స‌ర‌ళీకృతం అవుతుంద‌ని టీడీపీ పేర్కొన్న‌ది. కేంద్ర క‌మ్యూనికేష‌న్స్ మంత్రి పెమ్మ‌సాని చంద్ర‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. జ‌మిలి ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ద్వారా ఖ‌ర్చు త‌గ్గుతుంద‌న్నారు. ఓట‌ర్ల సంఖ్య కూడా పెరుగుతుంద‌న్నారు.
పెరుగుతున్న ఎన్నికల ఖర్చుతో భారం
ఏడాది అంతా ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరుగుతూ వుండడంతో ఎన్నికల భారం కేంద్ర ప్రభుత్వం భరించలేనిదిగా మారుతున్నదని బీజేపీ చెపుతున్నది. ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ద్వారా సుమారు ల‌క్ష కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని, అయితే జ‌మిలి నిర్వ‌హ‌ణ‌తో ఆ ఖ‌ర్చు త‌గ్గే ఛాన్సు ఉంద‌న్నారు. ఏక‌నాథ్ షిండే వ‌ర్గానికి చెందిన శివ‌సేన పార్టీ కూడా బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చింది.
పార్ల‌మెంట్ స్థాయి సంఘానికి పంపుతాం: అమిత్ షా
జ‌మిలి బిల్లు కేంద్ర క్యాబినెట్ ముందు చ‌ర్చ‌కు వ‌చ్చిన స‌మ‌యంలో.. ఆ బిల్లును పార్ల‌మెంట్ స్థాయి సంఘానికి పంపాల‌ని ప్ర‌ధాని మోదీ సూచ‌న చేసిన‌ట్లు కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. బిల్లును ఉప‌సంహ‌రించుకోవాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్న స‌మ‌యంలో.. కేంద్ర మంత్రి షా ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఐయూఎంఎల్ నేత ఈటీ మొహ‌మ్మ‌ద్ బ‌షీర్‌, ఆర్ఎస్పీ ఎంపీ ఎన్కే ప్రేమ‌చంద్ర‌న్‌.. బిల్లును వ్య‌తిరేకించారు. ఈ బిల్లు ఎంతవరకు అమలులోకి వస్తుందో చూడాలి.

Amit Shah jamili ttp

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.