దక్షిణ కొరియా కార్ల తయారీ దిగ్గజం కియా మోటార్స్ తాజాగా కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో కొత్త మోడల్ కారు తీసుకువచ్చింది. దీని పేరు సైరాస్ (Syros). ఫ్యూచర్ హైబ్రిడ్ కారు తరహాలో ఉన్న ఈ కారును కియా మోటార్స్ ఇండియా విభాగంగా నేడు గ్రాండ్ గా ఆవిష్కరించింది. ఈ కారు బుకింగ్స్ జనవరి 3న మొదలవుతాయని, ఫిబ్రవరి నెలలో డెలివరీలు ప్రారంభం అవుతాయని కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
చూడగానే ఆకట్టుకునేలా
కియా ఇప్పటికే ఈవీ9 పేరిట ఎలక్ట్రిక్ కారును తీసుకువచ్చింది. తాజాగా ఆవిష్కరించిన సైరాస్ కూడా లుక్స్ పరంగా ఈవీ9ను పోలి ఉంది. సైరాస్… మొత్తమ్మీద ట్రెండీ డిజైన్, స్పోర్టీ లుక్ తో చూడగానే ఆకట్టుకునేలా ఉంది.
ఇందులో ఉన్న వేరియంట్లు
వేరియంట్స్: ఇందులో 6 వేరియంట్లు ఉన్నాయి. అవి… హెచ్ టీఎక్స్, హెచ్ టీఎక్స్ ప్లస్, హెచ్ టీఎక్స్ ప్లస్ (ఓ), హెచ్ టీకే, హెచ్ టీకే ప్లస్, హెచ్ టీకే (ఓ) ఇంజిన్: సైరాస్ కారు 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 1.5 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తోంది.
గేర్ బాక్స్: 6 స్పీడ్ ఎంటీ, 7 స్పీడ్ డీసీటీ, 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ వెర్షన్లు ఉన్నాయి.
కలర్స్: గ్లేషియల్ వైట్ పెర్ల్, ఇంటెన్స్ రెడ్, ఆరా బ్లాక్ పెర్ల్, ఫ్రాస్ట్ బ్లూ, ఫ్యూటర్ ఆలివ్, స్కార్కింగ్ సిల్వర్, ఇంపీరియల్ బ్లూ, గ్రావిటీ గ్రే రంగుల్లో లభ్యమవుతుంది.
ఇతర అంశాలు: వర్టికల్ హెడ్ ల్యాంప్స్, అల్లాయ్ వీల్స్, లెవల్-2 అడాస్, హిల్ స్టార్ట్ అసిస్టెంట్ ఉన్నాయి.కియా సైరాస్ కారు కాంపాక్ట్ ఎస్ యూవీ సెగ్మెంట్లో హ్యుండాయ్ వెన్యూ, టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, మహీంద్రా ఎక్స్ యూవీ 3ఎక్స్ఓ కార్లకు గట్టి పోటీ ఇస్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధర వివరాలు ఇంకా ప్రకటించలేదు.