లిక్కర్ స్కామ్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి(Midhun Reddy)ని సిట్ అరెస్ట్ చేయడాన్ని పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. ఎంపీగా మూడు సార్లు గెలిచిన వ్యక్తిపై రాజకీయ కక్షతో కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ సీనియర్ నేత కాసు మహేశ్ రెడ్డి మాట్లాడుతూ, “ఈ కేసులో మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ఆయనపై నమ్మకం మాకు ఉంది. తప్పుడు కేసుల వెనుక కూటమి ప్రభుత్వం కుట్రలే ఉన్నాయి” అని అన్నారు.
కూటమి పాలనలో కక్ష సాధింపులు
వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బదులు, ప్రతిపక్షాన్ని అణిచివేయాలన్న కుట్రలే ఎక్కువైపోయాయని మండిపడ్డారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, “రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. అధికారంలో ఉన్నవారు ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా, వైసీపీని లక్ష్యంగా చేసుకుని వేదిస్తున్నారా?” అంటూ ప్రశ్నించారు.
తప్పుడు కేసులకు భయపడేది లేదు
వైసీపీ నాయకులు ఏకవాక్యం గా పేర్కొంటూ, తాము ఎలాంటి అక్రమ అరెస్టులను అంగీకరించబోమని, ప్రజల మద్దతుతో నిజం గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, అరెస్టులతో తమ నాయకులను మానవీయంగా తక్కువ చేస్తామని భావిస్తే అది భ్రమ అని హెచ్చరించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, కాలమే వారి కుట్రలకు సమాధానం చెబుతుందన్నారు.
Read Also : ISKCON : ఇస్కాన్ ప్రార్థనా మందిరంలో కేఎఫ్‌సీ చికెన్ తిన్న వ్యక్తి