ప్రపంచంలోనే ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా (Tesla ) భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. ఈరోజు ముంబైలోని బాంద్రా–కుర్లా కాంప్లెక్స్‌లో టెస్లా తన తొలి షోరూమ్‌ను ప్రారంభించనుంది. ఈ సందర్భంగా టెస్లా అభిమానులు, ఆటోమొబైల్ పరిశ్రమ వర్గాలు ఎలాన్ మస్క్ భారతదేశానికి వస్తారా? అనే ఆసక్తికరమైన ప్రశ్నలో మునిగిపోయాయి. అధికారికంగా మస్క్ పర్యటనపై నిర్ధారణ లేదు. అయితే, ఆయన వీడియో సందేశం ద్వారా కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం.
వీడియో సందేశమేనా? ప్రత్యక్ష హాజరా?
ఎలాన్ మస్క్ (Elon Musk) భారత పర్యటనకు సంబంధించి టెస్లా సంస్థ ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం, మస్క్ వీడియో సందేశం ద్వారా భారత ప్రజలతో మాట్లాడే అవకాశముందని తెలుస్తోంది. ఇది టెస్లా సంస్థ భారత్‌కు ఇచ్చే ప్రాధాన్యతను సూచిస్తున్నప్పటికీ, ఆయన ప్రత్యక్షంగా భారత్‌కు వస్తారా? లేదా? అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ముంబైలో జరుగుతున్న ఏర్పాట్లు, భద్రతా పరమైన చర్యలు చూసినప్పుడు ఆయన రాకపై అంచనాలు పెరిగిపోతున్నాయి.
TESLA Y మోడల్ – ధరలు, ప్రత్యేకతలు
ఈ షోరూమ్‌లో టెస్లా సంస్థ తమ ప్రముఖ మోడల్ TESLA Y కారును ప్రదర్శించనుంది. ఇది ఒక ఎలక్ట్రిక్ SUV మోడల్ కాగా, దీని ధర సుమారు రూ.60 లక్షల నుంచి రూ.70 లక్షల మధ్యగా ఉండవచ్చని అంచనా. శక్తివంతమైన బ్యాటరీ, ఆటో పైలట్, మోడర్న్ డిజైన్ వంటి ఫీచర్లతో ఈ కారును పరిచయం చేయనుంది. భారత మార్కెట్‌లో ఎలక్ట్రిక్ వాహనాలపై పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా టెస్లా ఈ అడుగు వేయడం ఎంతో ప్రాధాన్యత కలిగినదిగా పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు.
Read Also : Gold Price : బంగారం ధరలు తగ్గొచ్చు – WGC