📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Tamil Nadu 2026 Elections : హీరో విజయ్ పోటీ ఎక్కడి నుంచంటే?

Author Icon By Sudheer
Updated: February 22, 2026 • 7:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడు రాజకీయాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా అగ్ర నటుడు విజయ్ స్థాపించిన ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీ ఏ నియోజకవర్గంపై దృష్టి సారిస్తుందనే చర్చకు తెరపడింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ అధవ్ అర్జున తాజా ప్రకటన ప్రకారం.. విజయ్ ఉత్తర చెన్నై (North Chennai) లోని ఒక నియోజకవర్గం నుంచి బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. దశాబ్దాలుగా ఉత్తర చెన్నై వెనుకబాటుకు అధికార పార్టీ డీఎంకే (DMK) కారణమని టీవీకే మొదటి నుంచి విమర్శిస్తోంది. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం ద్వారా, అధికార పార్టీ వైఫల్యాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని విజయ్ వ్యూహాత్మక అడుగు వేస్తున్నారు.

Hyderabad-Goa Greenfield Highway : హైదరాబాద్-గోవా గ్రీన్‌ఫీల్డ్ హైవేపై కీలక అప్డేట్

ఉత్తర చెన్నై రాజకీయంగా అత్యంత కీలకమైనది మాత్రమే కాకుండా, శ్రామిక వర్గం మరియు సామాన్య ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతం. ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని, తాము అధికారంలోకి వస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులను వివరిస్తూ విజయ్ తన ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికల కమిషన్ టీవీకే పార్టీకి ‘విజిల్’ గుర్తును కేటాయించడంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొంది. నియోజకవర్గాల పరంగా చూస్తే పెరంబూర్ లేదా ఆర్కే నగర్ వంటి స్థానాల నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చెన్నై నడిబొడ్డు నుంచి పోటీ చేయడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపవచ్చని విజయ్ భావిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Latest News in Telugu Telugu News TVK Vijay Vijay contest from

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.