Viral : ఆ వీడియోలో తప్పేముంది – బీఆర్ నాయుడు

Read Time:  1 min
BR Naidu: డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
BR Naidu: డీప్‌ఫేక్ వీడియోల పై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆగ్రహం
FONT SIZE
GET APP

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తనపై జరుగుతున్న సోషల్ మీడియా దుష్ప్రచారంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తనతో పాటు ఒక మహిళ ఉన్న వీడియోను మార్ఫింగ్ చేసి, తప్పుడు అర్థం వచ్చేలా ప్రచారం చేస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. ఆ వీడియోలో ఎలాంటి తప్పు లేదని, ఆమె తన కుటుంబ స్నేహితురాలని ఆయన వివరణ ఇచ్చారు. తమ రెండు కుటుంబాలకు గత 30 ఏళ్లుగా పరిచయం ఉందని, అందులో ఎలాంటి వల్గారిటీ లేదని నాయుడు మీడియా సమావేశంలో స్పష్టంచేశారు. కేవలం రాజకీయ ఉద్దేశంతోనే పాత వీడియోలు, ఫొటోలను మార్ఫింగ్ చేసి వైరల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

తాను ఏ తప్పు చేయలేదని, అందుకే ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని బీఆర్ నాయుడు తేల్చిచెప్పారు. ఈ కుట్ర వెనుక వైసీపీ నేతలు భూమన కరుణాకర్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఉన్నారని ఆయన ప్రత్యక్ష ఆరోపణలు చేశారు. తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్న వారికి ఖచ్చితంగా బుద్ధి చెబుతానని, చుక్కలు చూపిస్తానని నాయుడు హెచ్చరించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇలాంటి నీచమైన పద్ధతులకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.