📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

PM Modi: మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాం!: పీఎం మోడీ

Author Icon By Shobha Rani
Updated: May 26, 2025 • 5:19 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పాకిస్తాన్‌కు మరోసారి గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. దాహోద్‌ సభలో పాక్‌ను చీల్చిచెండాడారు. పహల్గామ్‌ దాడికి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పిల్లల ముందు తండ్రిని దారుణంగా చంపి ఉగ్రవాదులు 140 కోట్ల మంది భారతీయులకు సవాల్‌ విసిరారని అన్నారు. మోదీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో పాకిస్తాన్‌కు చూపించామన్నారు. పహల్గామ్‌ దాడి దృశ్యాలు గుర్తుకు వస్తే ఇప్పటికి కూడా తన రక్తం మరిగిపోతోందని మోదీ(PM Modi) పేర్కొన్నారు.. భారత మహిళల సింధూరాన్ని తుడిచేసిన ఉగ్రవాదులను మట్టిలో కలిపేసినట్టు ప్రకటించారు. పహల్గామ్‌ దాడికి భారత ప్రజలు కోరుకున్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. పాక్‌లో 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేశామన్నారు. భారతదేశ మహిళలకు హాని కలిగించేవారు లేదా ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేవారు మట్టిలో కలవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చారు. పహల్గామ్ ఘటన దేశాన్ని కదిలించింది.. కఠినమైన చర్య తీసుకోవాలని అంతా డిమాండ్ చేశారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఏప్రిల్ 22న, దాడి చేసిన వారిని ఆపరేషన్ సిందూర్ తో మట్టిలో కలిపేశామన్నారు. సైన్యానికి స్వేచ్ఛా హస్తం ఇచ్చామని.. దశాబ్దాలుగా ప్రపంచం చూడనిది తాము సాధించి చూపించామన్నారు. మహిళల సిందూరాన్ని తొలగించే ధైర్యం చేయండి.. ఇక మీ పరిస్థితి ఎలా ఉంటుందో చూపిస్తాం అంటూ.. ప్రధాని మోదీ పాకిస్తాన్, ఉగ్రవాదులను హెచ్చరించారు.

PM Modi: మాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపించాం!: పీఎం మోడీ

ప్రమాణస్వీకారానికి 11 ఏళ్లు – జ్ఞాపకాలను విసిరిన మోదీ
11 ఏళ్ల క్రితం ఇదే రోజు ప్రధాని పగ్గాలు చేపట్టానని ప్రధాని మోదీ(PM Modi) పేర్కొన్నారు. తన రాజకీయ ప్రయాణంలో మే 26ని ఒక ముఖ్యమైన రోజని పేర్కొన్నారు. 2014లో ఇదే తేదీన తాను తొలిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు. “ఈ రోజు మే 26. 2014లో ఇదే తేదీన, నేను మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాను… మొదట, గుజరాత్ ప్రజలు నన్ను ఆశీర్వదించారు, తరువాత కోట్లాది మంది భారతీయులు నన్ను ఆశీర్వదించారు. అంటూ మోదీ(PM Modi) పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో ప్రధాని మోదీ ప్రసంగం జాతీయ భద్రత, దేశ గౌరవం, అభివృద్ధి అంశాలను స్పృశించింది. మహిళల సింధూరాన్ని తొలగించాలనుకునే ఉగ్రవాదులు మట్టిలో కలిసిపోతారు అన్న ఆయన మాటలు దేశవ్యాప్తంగా ప్రజలలో భద్రత పట్ల నమ్మకాన్ని పెంచాయి. రైలు ఇంజిన్ ప్రాజెక్టు ప్రారంభం ద్వారా ఆయన అభివృద్ధి పట్ల ఉన్న కట్టుబాటును చాటిచెప్పారు.వడోదర తర్వాత దాహోద్‌కు వెళ్లిన ప్రధాని, భారతీయ రైల్వేలకు కొత్త గిఫ్ట్‌ ఇచ్చారు. దాహోద్‌లో రైలు ఇంజిన్ల తయారీ కర్మాగారాన్నిదేశానికి అంకితం చేశారు ప్రధాని మోదీ(PM Modi). ఈ ప్లాంట్‌లో తయారైన తొలి ఎలక్ట్రిక్‌ రైల్‌ ఇంజిన్‌కు ప్రధాని (PM Modi) పచ్చజెండా ఊపారు. – భారతీయ రైల్వేల లోడింగ్‌ కెపాసిటీ పెంచబోతున్నాయి ఈ రైలు ఇంజిన్లు. ఇక్కడ 9000 హార్స్‌పవర్‌ సామర్థ్యమున్న ఎలక్ట్రిక్‌ రైలు ఇంజిన్ల ఉత్పత్తి చేస్తారు. వేలాది కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

Read Also: Kerala : కేరళ తీరంలో MSC ELSA 3 ఓడ మునక

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news what it is like to be with us!: PM Modi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.