ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య విద్యానంద్ మహారాజ్ (Acharya Vidyanand Maharaj) శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రపంచమంతా హింసతో అలమటిస్తున్న తరుణంలో, భారతదేశం మాత్రమే అహింస మార్గాన్ని విశ్వానికి పరిచయం చేసిన దేశమని ఆయన గర్వంతో పేర్కొన్నారు. భారత నాగరికత అనాదిగా శాంతి, సహనం, సహజీవనం పునాది మీద ఆధారపడిందని ప్రధాని స్పష్టంగా చెప్పారు.
జైన సంప్రదాయాన్ని పొగిడిన మోదీ
జైన ధర్మం మూల సూత్రాలైన ‘అహింసా, సత్యం, అపరిగ్రహం’ మనిషిని మార్గదర్శనం చేయగల శక్తివంతమైన విలువలని ప్రధాని మోదీ పేర్కొన్నారు. విద్యానంద్ మహారాజ్ జీవిత మార్గం, సందేశాలు సమాజాన్ని మేల్కొలిపే శక్తిగా నిలుస్తాయని అన్నారు. జైన ఆధ్యాత్మిక చరిత్రకు గౌరవం తెలుపుతూ మోదీకి “ధర్మ చక్రవర్తి” బిరుదుతో జైన సన్యాసులు సత్కారం చేశారు.
ఆపరేషన్ సిందూర్కు ఆశీర్వాదం కోరిన ప్రధాని
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ భారతదేశం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” విజయవంతం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌కి దేశ ప్రజలే కాకుండా అన్ని ధార్మిక గురువుల ఆశీర్వాదం కూడా అండగా నిలవాలని ఆకాంక్షించారు. భారత ఆధ్యాత్మిక వారసత్వం ప్రపంచానికి మార్గనిర్దేశకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Read Also : Earth Quake: దక్షిణ ఫిలిప్పీన్స్ భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు!