Vishnupriya father murder : కోలీవుడ్ నటి విష్ణుప్రియ తండ్రి, హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సూర్యనారాయణన్ (73) తమిళనాడులోని కొడైకెనాల్‌లో దారుణ హత్యకు గురయ్యారు. దుండగులు ఆయనను కుర్చీకి కట్టేసి, ముక్కు–నోటిని టేపులతో మూసి ఊపిరాడకుండా చేసి హతమార్చినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనలో నగదు, బంగారం, ముఖ్య పత్రాలు దోచుకెళ్లినట్లు తెలుస్తోంది.
దిండిగల్ జిల్లా కొడైకెనాల్‌లోని కురింజి ఆండవర్ ఆలయం సమీపంలో సూర్యనారాయణన్‌కు గెస్ట్ హౌస్ ఉంది. రెండు రోజుల క్రితం కోయంబత్తూర్‌కు చెందిన ఐదుగురు యువకులు పర్యాటకులమని చెప్పి అక్కడ గదులు అద్దెకు తీసుకున్నారు. శనివారం సాయంత్రం సిబ్బంది వెళ్లిపోయిన తర్వాత గెస్ట్ హౌస్‌లో సూర్యనారాయణన్‌తో పాటు సంరక్షకులు ఆర్ముగం, మురళి మాత్రమే ఉండగా, ఇదే అవకాశంగా భావించిన నిందితులు వారిని తాళ్లతో కట్టేసి సూర్యనారాయణన్‌ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Shikhar Dhawan ties knot : రెండో పెళ్లి చేసుకున్న శిఖర్ ధవన్
సంరక్షకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఇది కేవలం దోపిడీ కోసం జరిగిన హత్యేనా? లేక పాత వైరం కారణమా? అనే కోణాల్లో కూడా విచారణ కొనసాగుతోంది.
గతంలో నటి విష్ణుప్రియ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన డ్రైవర్ హత్య కేసులో సూర్యనారాయణన్ నిందితుడిగా ఉన్నట్లు సమాచారం. ఆ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉండటంతో ప్రతీకార హత్య కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. పరారీలో ఉన్న ఐదుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: