📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest news: Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

Author Icon By Saritha
Updated: November 1, 2025 • 1:40 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాహనాల రాకపోకలకు సిద్ధం చేస్తున్న అధికారులు

విజయవాడ : విజయవాడ(Vijayawada) పశ్చిమ బైపాస్ (ప్యాకేజీ-3)లో కొన్ని నెలలుగా కొనసాగుతున్న విద్యుత్ హైటెన్షన్ వైర్ల అలైన్మెంట్ వివాదానికి హైకోర్టు తీర్పుతో స్పష్టత లభించింది. హైకోర్టు(High Court) ఆదేశాలతో పశ్చిమ బైపాస్ రహదారి త్వరలో వాహనాల రాకపోకలకు సిద్ధమవుతున్నదని అధికార వర్గాలు వెల్లడించాయి. జక్కంపూడి, అంబాపురం ప్రాంతాల్లోని ఆరు టవర్ల విషయంలో పాత అలైన్మెంట్ ప్రకారమే టవర్లను ఉంచి, వాటి ఎత్తును పెంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుతో రైతులు, ఎన్హెచ్ఎఐ మధ్య వివాదానికి తెరపడే అవకాశం కనిపిస్తోంది. చినఆవుటపల్లి నుంచి గొల్లపూడి వరకు ఇన్న పశ్చిమ బైపాస్ రహదారి ప్యాకేజీ-3లో జక్కంపూడి, అంబాపురం, నున్న పరిధిలో మొత్తం 8 విద్యుత్ టవర్లు ఉన్నాయి. ప్రస్తుతం ఇవి రోడ్డు ఉపరితలం నుంచి 9 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఎన్హెచ్ఎఐ, ల్యాంకో పవర్ ప్రాజెక్ట్ సంస్థలు ఈ ఎవర్లను తొలగించి కొత్త అలైన్మెంట్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. అయితే, దీనికి వ్యతిరేకంగా జక్కంపూడి.. అంబాపురంలోని 24 మంది రైతులు, నున్నలోని 8 మంది రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. పాత అలైన్మెంట్ని కొనసాగిస్తూ వైర్ల ఎత్తును పెంచాలని డిమాండ్ చేశారు.

Read also: ట్రంప్ సీటుపై జేడీ వాన్స్ కన్నేశారా? ఉష మతంపై ఆయన అభిప్రాయం అదేనా!

Vijayawada: విజయవాడ పశ్చిమ బైపాస్ రెడి

హైకోర్టు తీర్పుతో పశ్చిమ బైపాస్ ప్రాజెక్టుకు వేగం వచ్చింది

ఈ నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, పాత మార్గం ప్రకారమే టవర్ల ఎత్తును రోడ్డుపైనుంచి కనీసం 14 మీటర్లకు పెంచాలని స్పష్టమైన తీర్పు(Vijayawada) ఇచ్చారు. రైతులు తమ ఆవేదనను ప్రధాని కార్యాలయం, కేంద్ర రహదారుల శాఖ మంత్రికి కూడా తెలియజేశారు. వారి విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు. వ్యవసాయ భూములకు నష్టం కలగకుండా ప్రాజెక్టు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్యాకేజీ-3లో పనులు దాదాపు పూర్తి కావొచ్చే దశలో ఉన్నాయి. విద్యుత్ వైర్ల ఎత్తుపై తలెత్తిన వివాదం కారణంగా రహదారిని వాడుకలోకి తీసుకురాలేక పోయారు. నున్నలో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ, అక్కడ పెద్దగా అడ్డంకులు లేనందున అదే విధమైన తీర్పు వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. రాబోయే పది రోజుల్లో నున్న టవర్ల విషయంలోనూ కోర్టు తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ వివాదం పరిష్కారం అవగానే పశ్చిమ బైపాస్ రహదారి పూర్తిస్థాయిలో ప్రయాణానికి సిద్ధమవుతుందని అధికారులు తెలిపారు. విజయవాడ నగర రవాణాకు ఈ మార్గం కొత్త ఊపిరినిచ్చేలా మారనుంది.

ప్రభుత్వ చొరవతోనే పరిష్కారం సాధ్యమైంది

పశ్చిమ బైపాస్ ప్రాజెక్టు ఆలస్యానికి కారణమైన ఈ టవర్ల వివాదం పరిష్కార దిశగా సాగడానికి కూటమి ప్రభుత్వం కీలక పాత్ర పోషించింది. ప్రజాప్రతినిధులు నిత్యం కేంద్రంలో, రైతులతో సంప్రదింపులు జరిపారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ప్రిన్సివల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, కలెక్టర్ లక్ష్మీశన్లతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ రైతులు, ఎన్హెచ్ఎఐ, పవర్ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపి తగిన పరిష్కారం సూచించింది. ఎన్హెచ్ఎఐ కూడా సానుకూలంగా స్పందించడంతో, ప్రాజెక్టుకు ఉన్న అడ్డంకులు అన్నీ తొలగిపోయాయి. దీంతో ప్రస్తుతం పశ్చిమ బైపాస్ పూర్తి దిశగా అడుగులు పడుతున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Amaravati Region Andhra Pradesh Government Farmers Dispute High Court verdict infrastructure development Latest News in Telugu NHAI Power Lines Telugu News Vijayawada West Bypass Road

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.