📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Vijayawada: దుర్గగుడిలో రికార్డు స్థాయిలో తలనీలాల ధర

Author Icon By Saritha
Updated: December 30, 2025 • 4:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంద్రకీలాద్రిపై(Vijayawada) కొలువైన కనకదుర్గమ్మ ఆలయంలో తలనీలాల వేలం పాట రికార్డు సృష్టించింది. భక్తులు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో సమర్పించే తలనీలాలను సేకరించే హక్కులకు సంబంధించి అధికారులు నిర్వహించిన వేలం పాటలో గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ధర పలికింది. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ‘ఇండియన్‌ హెయిర్‌ ఇండస్ట్రీస్‌’ సంస్థ రూ.10.10 కోట్లకు ఈ టెండర్‌ను దక్కించుకుంది. గతంతో పోలిస్తే ఈసారి ఆలయానికి ఆదాయం భారీగా సమకూరింది.

Read Also: YS Jagan: ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించిన జగన్

వివిధ రాష్ట్రాల 19 మంది కాంట్రాక్టర్లు పోటీ

రెండేళ్ల క్రితం జరిగిన వేలంలో తలనీలాల సేకరణ ద్వారా ఆలయానికి రూ.5.67 కోట్లు మాత్రమే రాగా, ఈసారి అది దాదాపు రెట్టింపు కావడం విశేషం. (Vijayawada) తాజా ఒప్పందం ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.10.10 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాతి ఏడాది (2027-28) కి మరో 10 శాతం అదనంగా, అంటే రూ.11.11 కోట్లకు టెండర్ ఖరారైంది. దుర్గగుడిలోని మల్లికార్జున మహా మండపం ఆరో అంతస్తులో ఈ వేలం పాటను అధికారులు నిర్వహించారు. ఈ వేలంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ,(TG) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి మొత్తం 19 మంది కాంట్రాక్టర్లు పోటీపడ్డారు. బహిరంగ వేలం, సీల్డ్‌ టెండర్, ఈ-టెండర్ విధానాల్లో బిడ్లను ఆహ్వానించారు. ఇందులో నలుగురు సీల్డ్ టెండర్లు వేయగా, బహిరంగ వేలంలో ఇండియన్ హెయిర్ ఇండస్ట్రీస్ అత్యధిక ధరను కోట్ చేసి హక్కులను సొంతం చేసుకుంది. ఈ ప్రక్రియ ద్వారా ఆలయ ఆదాయం గణనీయంగా పెరగడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Auction of hair Indian Hair Industries Kanaka Durga Temple Latest News in Telugu Telugu News Temple revenue Temple Tender Vijayawada Indrakeeladri

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.