📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం రైతులకు గమనిక.. 11 అంకెల ఐడీ తప్పనిసరి నేటి నుంచే శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు అన్వేష్‌ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన VSR ఏవియేషన్‌తో హెరిటేజ్‌కు ఎలాంటి సంబంధం లేదని లోకేశ్ స్పష్టం క్యారెక్టర్ లేని వాళ్లకు పార్టీలో చోటు లేదు జిమ్‌లో గుండెపోటుతో యువకుడు మృతి పునర్విక కు లోకేష్ రూ.6 కోట్ల సాయం జన గణన ప్రక్రియపై అవగాహన తప్పన సరి:హిమాన్ష్ శుక్ల వృద్ధురాలి వద్ద 40 గ్రాముల బంగారం చోరీ డయేరియా మరణాలపై ఆవేదన వ్యక్తం చేసిన ధర్మాన నందిపల్లి నందీశ్వర ఆలయంలో జగన్ ప్రత్యేక పూజలు మైనింగ్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానంటూ మోసం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం సునీల్ నాయక్ అరెస్ట్ లో అనూహ్య పరిణామం

Veligonda : జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇష్టం – చంద్రబాబు హామీ

Author Icon By Sudheer
Updated: February 25, 2026 • 10:35 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రకాశం జిల్లా వాసుల దశాబ్దాల కల అయిన వెలిగొండ ప్రాజెక్టును ఈ ఏడాది జూలై నాటికి పూర్తి చేసి, మార్కాపురం ప్రాంతంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం గంటవాని పల్లెలో రూ.456 కోట్లతో ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన, గత ప్రభుత్వం ప్రాజెక్టు పూర్తి కాకుండానే ‘జాతికి అంకితం’ అంటూ చేసిన రిబ్బన్ కటింగ్లను దొంగ నాటకాలుగా అభివర్ణించారు. 1996లోనే ఈ ప్రాజెక్టుకు పునాది వేసిన వ్యక్తిగా, దానిని తానే పూర్తి చేసి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతానని హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు ద్వారా 4.35 లక్షల ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు జలకళ వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు విశ్రాంత ఇంజనీర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకునేలా బ్లూ ప్రింట్ తయారు చేస్తున్నట్లు వెల్లడించారు.

Basara IIIT Student Suicide: బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని సూసైడ్

మరోవైపు, మార్కాపురాన్ని కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామన్న హామీని నిలబెట్టుకున్నందుకు స్థానిక ప్రజల నుంచి ముఖ్యమంత్రికి అపూర్వ స్వాగతం లభించింది. జిల్లా కేంద్రం ఏర్పాటుతో ఒంగోలు వరకు వెళ్లే ప్రయాణ భారం తగ్గిందని, పాలనను ప్రజల చెంతకు చేర్చామని ఆయన పేర్కొన్నారు. నూతన జిల్లా కలెక్టరేట్ నిర్మాణానికి రూ. 50 కోట్లు మంజూరు చేయడంతో పాటు, రూ. 1300 కోట్లతో ప్రతి ఇంటికీ నల్లమల సాగర్ నుంచి సురక్షితమైన తాగునీరు అందిస్తామని వాగ్దానం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన, ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు మరియు రాజముద్రతో కూడిన కొత్త పాస్ పుస్తకాల పంపిణీ ద్వారా రైతులకు భూ భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. సంక్షేమ పథకాలైన ‘సూపర్ సిక్స్’, తల్లికి వందనం, మరియు నిరుద్యోగుల కోసం మెగా డీఎస్సీ వంటి కార్యక్రమాలతో రాష్ట్ర పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టామని, రాబోయే రోజుల్లో మార్కాపురం మరియు రాయలసీమ ప్రాంతాలను ఉద్యాన పంటల కేంద్రాలుగా మారుస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Chandrababu Veligonda

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.