ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువైపోతున్నాయి. అహమ్మదాబాద్ లో విమానం కూలి, అనేకులు మరణించారు. ఈ ప్రమాదం తర్వాత కూడా పలు విమాన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో విమాన ప్రయాణం చేయాలంటేనే ప్రయాణికులు హడలిపోతున్నారు. తాజాగా టర్కీకిలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. (Plane crash)టర్కీకి చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20 మంది సిబ్బందితో అజర్ బైజాన్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై గింగిరాలు తిరుగుతూ నేల కూలిపోయింది. అజర్ బైజార్ నుంచి టర్కీ(Turkey) వెళ్తున్న ఆ విమానం జార్జియా భూభాగంపై ఉండగా ప్రమాదానికి గురైంది. దీంతో జార్జియాలోనే అది కూలిపోయింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Read also: కొత్త ఆర్థిక లాభాల దిశగా ప్రభుత్వం నిర్ణయం
20 మంది మృత్యువాత పడ్డారు
టర్కీకి (Plane crash) చెందిన సి-130 అనే మిలిటరీ విమానం 20మంది సిబ్బందితో అజర్ బైజాన్ నుంచి స్వదేశానికి బయలుదేరింది. మార్గమధ్యంలో జార్జియాలోని సిగ్నాఘి ప్రాంతంలో ప్రమాదానికి గురై నేలకూలిపోయింది. పొగ, మంటలు విమానాన్ని చుట్టుముట్టడంతో అందులో ఉన్న మొత్తం 20 మంది మరణించినట్టు సమాచారం. విమానం నేలకూలిన విషయాన్ని టర్కీ రక్షణశాఖ, జార్జియా అంతర్గత వ్యవహారాల శాఖ ధ్రువీకరించాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా విమానంలో ఉన్న మొత్తం 20 మంది దుర్మరణం చెందినట్లు టర్కీ ప్రభుత్వం వెల్లడించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: