📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Tummala Nageswara Rao: విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Author Icon By Ramya
Updated: July 8, 2025 • 11:47 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాజేడు (ఖమ్మం) : నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని, విత్తన చట్టాన్ని రూపొందించుటకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. సోమవారం ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో వాజేడు, వెంకటాపురం, కన్నాయి గూడెం మండలాల్లో 1521 ఎకరాల్లో మొక్కజొన్న వేసి పంట నష్టపోయిన 671 రైతులకు రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకారం, చేనేత, వస్త్రాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao), రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం. కోదండరెడ్డి, తెలంగాణా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్. అన్వేష్ రెడ్డి, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., ఐటీడిఏ పి.ఓ. చిత్ర మిశ్రా లతో కలిసి 3 కోట్ల 80 లక్షల 97 వేల 264 రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు.

Tummala Nageswara Rao: విత్తన చట్టాన్ని రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు (Tummala Nageswara Rao) మాట్లాడుతూ జిల్లాలోని వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో మొక్కజొన్న పంట వేసి నష్టపోయిన రైతులందరికీ (To all the farmers who have lost) ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్టపరిహారం అందించడం జిల్లా అధికారుల సమిష్టి కృషితోనే సాధ్యమైందని, రాష్ట్రంలోని రైతులకు లక్ష అయి దు కోట్ల రూపాయలు అందించి రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నామని అన్నారు. విత్తనాలతో పోకుండా విత్తన రైతులు మోస రాష్ట్రంలో చట్టాన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఆదివాసీల జీవన విధానంలో మార్పు రావడానికి మంత్రి సీతక్క ప్రజా జీవితాన్ని ప్రారంభించడం గొప్ప విషయమని, ప్రైవేటు కంపెనీల యజమానుల మెడలు వంచి రైతులకు నష్టపరిహారం అందించడం (Providing compensation to farmers) జిల్లా అధికారుల కృషి ఎన్నటికీ మరువలేమని అన్నారు. రాష్ట్రంలోని ప్రజా ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అభివృద్ధి ఫలాలను అమలు చేస్తున్నదని, గ్రామాలకు రోడ్డు సౌకర్యాలు కలిగినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు.

ములుగు జిల్లాలో పర్యాటక అభివృద్ధికి నూతన దిశ

దేశంలో ఎక్కడ లేని విధంగా ములుగు జిల్లాలో పర్యటక ప్రాంతాలు ఉన్నాయని, రానున్న రోజులలో కర్రెగుట్టలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దామని తెలిపారు. గతం లోని పాలకులు రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు దండుకున్నారని, తాము అధికారంలోకి వచ్చిన అనంతరం ఇందిరమ్మ రాజ్యం ద్వారా రైతులకు అన్ని సంక్షేమ వలాలను అందజేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు సహకరించకపోయిన అప్పులు తీర్చుతూనే నూతన పథకాలను. ప్రవేశపెడుతున్నామని, జిల్లాలో పామాయిల్ పంట సాగు చేయడమే కాకుండా హార్టికల్చర్, సెరికల్చర్ ద్వారా రైతులకు ఆదాయం అందే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా విత్తనాలు, ఫర్టిలైజర్ కొనుగోలు చేసిన పక్షంలో బిల్లులు తప్పనిసరిగా పొందాలని, వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఐదు నెలల పోరాట ఫలితంగా నేడు రైతులు ప్రైవేట్ కంపెనీల ద్వారా నష్ట పరిహారం పొందుతున్నారని, చరిత్రలోనే నిలిచిపోతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ పలుసార్లు సమావేశాలు నిర్వహించడమే కాకుండా ప్రైవేట్ కంపెనీలను ఒప్పించడంలో విజయం సాధించ్చారని హర్షం వ్యక్తం చేశారు.

తుమ్మల నాగేశ్వరరావు గారి పదవి ఏమిటి?

తుమ్మల నాగేశ్వరరావు గారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా వ్యవహరిస్తున్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ విధానాల రూపకల్పన, విత్తనాల సరఫరా, సాగు నీటి సద్వినియోగం వంటి అంశాలు ఆయన పరిధిలోకి వస్తాయి.

తెలంగాణ టెక్స్టైల్స్ శాఖ మంత్రి ఎవరు?

తెలంగాణ రాష్ట్రానికి టెక్స్టైల్స్‌ (పట్టుదారలు & వస్త్రాలు) వ్యవహారం చూసే మంత్రిగా ప్రస్తుతం శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యతలు నిర్వహిస్తున్నారు .

Read hindi news: hindi.vaartha.com
Read also: Dost – 2025: దోస్త్ – 2025లో 1.43 లక్షల మంది ప్రవేశాలు

AgricultureDepartment Breaking News FarmerWelfare latest news TelanganaGovernment Telugu News TextileDepartment TummalaNageswaraRao

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.