📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Telugu News: Tummala Nageswara Rao: సీడ్ బాల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ

Author Icon By Pooja
Updated: September 26, 2025 • 10:53 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా దేశంలోనే తెలంగాణ గుర్తింపుపొందిందని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భవిష్యత్తులో గ్లోబల్ సీడ్ క్యాపిటల్గా(global seed capital) నిలుస్తుంద న్నారు. హైదరాబాద్లో గురువారం మాట్లాడుతూ నాణ్యమైన విత్తనాల తయారీలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు.

విత్తన ఉత్పత్తిలో అగ్రగామి తెలంగాణ

ప్రతి ఏటా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న కోటి క్వింటాళ్ల విత్తనాలలో 75 లక్షల క్వింటాళ్లు వరి, 10 లక్షల క్వింటాళ్లు మొక్కజొన్న, చెప్పారు. ప్రస్తుతం దాదాపు 8 లక్షల ఎకరాల్లో విత్తన ఉత్పత్తి సాగుతో పాటు, 3.5 లక్షల మంది రైతులు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతున్నారని తెలిపారు.

ప్రతి సంవత్సరం రూ.2 వేల కోట్ల విలువైన లక్ష టన్నుల విత్తనం రాష్ట్రం నుంచి ఎగుమతి అవుతుందని వెల్లడించారు. ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాల వలన అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యమైన తెలంగాణ విత్తనాలకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు.

Telugu News: Indiramma illu: బాధితులకు బాసటగా ఇందిరమ్మ ఇళ్ల కాల్ సెంటర్

నూనె గింజల సాగు – గేమ్ ఛేంజర్

ప్రస్తుతం రాష్ట్రంలో 1.30 లక్షల ఎకరాల్లో సాగుతున్న ఆయిల్ ఫామ్, మరింత విస్తరించి రాష్ట్ర అభివృద్ధికి గేమ్ ఛేంజర్ మారనుందని వివరించారు. నిజాయితీగా పనిచేసే విత్తన కంపెనీలను ప్రోత్సాహించడం, నకిలీ విత్తనాలనుంచి(fake seeds) రైతులను రక్షిచడం రెండూ ముఖ్యమన్నారు.

విత్తన చట్ట సవరణలు – కొత్త దిశలో అడుగులు

ఈ లక్ష్యాల సాధనకు విత్తన చట్ట సవరణలు తీసుకొస్తున్నామని, ప్రస్తుతం అవి ముసాయిదా దశలో ఉన్నాయని వెల్లడించారు. విత్తన పరిశ్రమ సహకారాలు అవసరమైన అన్ని అందిస్తామన్నారు.

వాతావరణ మార్పులకు తట్టుకునే కొత్త హైబ్రిడ్ల అభివృద్ధికి పరిశోధనలో పెట్టుబడులు పెంచాలని, ఆహార ధాన్యాలే కాకుండా ఉద్యానపంటలకు ముఖ్యంగా అధిక దిగుబడి ఇచ్చే కూరగాయ విత్తనాలను రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ అడిషనల్ డైరెక్టర్, విత్తన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

తెలంగాణను సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఎందుకు పిలుస్తున్నారు?
నాణ్యమైన విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో అగ్రస్థానంలో ఉందని, ఎక్కువ మొత్తంలో విత్తనాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నందున.

ప్రతి సంవత్సరం తెలంగాణ నుంచి ఎన్ని టన్నుల విత్తనం ఎగుమతి అవుతోంది?
సుమారు లక్ష టన్నుల విత్తనం, రూ.2 వేల కోట్ల విలువతో ఎగుమతి అవుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Agriculture Minister Tummala Nageswara Rao Breaking News in Telugu Global Seed Capital Latest News in Telugu Seed Bowl of India Seed Production Telangana Seeds Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.