📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్ని రాష్ట్రాల రాజధానుల్లో స్వామి ఆలయాలు: టీటీడీ

Author Icon By sumalatha chinthakayala
Updated: December 25, 2024 • 10:26 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరుడి ప్రాముఖ్యతను మరింతగా పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో టీటీడీ ఆలయాలు ఏర్పాటు చేయాలని నిర్మయించింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో సమావేశమైన టీటీడీ మండలి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

తిరుమల తిరుపతి దేవస్థాన ఆలయాలలు, ఆస్తులను మరింత విస్తరించాలని చంద్రబాబు సూచించారు. ఆయన సూచనల మేరకు నిపుణుల కమిటీ వేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకోనున్నారు. అదే టైంలో చంద్రబాబు సూచించినట్టు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాల రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏర్పాటు చేయనున్నారు. దీనికి పాలకమండలి ఆమోదం తెలిపింది.

తిరుమల వచ్చే భక్తుల సౌకర్యాలపై కూడా టీటీడీ దృష్టి పెట్టింది. వచ్చే భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనే చర్యలకు శ్రీకారం చుట్టింది. దీని కోసం ఫీడ్‌బ్యాక్ మేనేజ్మెంట్ సిస్టం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్ డిజిటల్ కార్పొరేషన్ హెల్ప్ తీసుకొని ఈ ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. తిరుమలలో ఉన్న బిగ్‌, జనతా క్యాంటీన్‌లలో ఫుడ్ సరిగా లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నట్టు ప్రకటించింది. ఇక్కడ మరింత మంచి ఫుడ్ అందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ క్యాంటీన్లను ఆహ్వానించేందుకు కొత్త విధానం తీసుకురానున్నారు. తిరుమలలో ఆహార పదార్థాలను తనిఖీ కోసం ప్రత్యేకంగా ఫుడ్ సెఫ్టి డిపార్టమెంట్‌ ఏర్పాటు చేయాలని నిర్మయించారు. దీనికి సీనియర్ ఫుడ్ సేఫ్టి ఆఫీస‌ర్‌ పోస్టును SLSMPC కార్పొరేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

build temples lord venkateswara swamy TTD TTD Chairman BR Naidu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.