అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఆంథ్రోపిక్ (Anthropic) ఏఐ టెక్నాలజీ వాడకాన్ని తక్షణమే నిలిపివేయాలని సంచలన ఆదేశాలు జారీ చేశారు. ఈ కఠిన నిర్ణయం వెనుక ప్రధానంగా పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ) మరియు ఆంథ్రోపిక్ మధ్య జరిగిన అంతర్గత ఘర్షణ ఉంది. యుద్ధ రంగంలో ఉపయోగించే అటానమస్ వెపన్స్ (స్వయంప్రతిపత్తి గల ఆయుధాలు) తయారీకి, అలాగే యుద్ధ వ్యూహాల విశ్లేషణకు తమ ‘Claude AI’ సాఫ్ట్‌వేర్‌లోని భద్రతా నియమాలను (Safeguards) తొలగించాలని పెంటగాన్ ఒత్తిడి తెచ్చింది. అయితే, ప్రాణాంతక ఆయుధాల తయారీకి లేదా యుద్ధాల్లో నేరుగా ఏఐని వాడటానికి తమ నిబంధనలు అంగీకరించవని, నైతిక విలువల దృష్ట్యా వాటిని మార్చలేమని ఆంథ్రోపిక్ స్పష్టం చేసింది. ఈ మొండివైఖరిని తీవ్రంగా పరిగణించిన ట్రంప్, ఆ సంస్థ సేవలను ప్రభుత్వ పరిధిలో ‘నో యూజ్’ (No Use) జాబితాలో చేర్చారు.
GHMC new act Telangana : హైదరాబాద్‌కు కొత్త చట్టం, సీఎం రేవంత్ కీలక నిర్ణయం
ఈ నిర్ణయంపై మండిపడిన ట్రంప్, దేశ రక్షణ మరియు సైన్యం ఎలా పోరాడాలి అనే విషయంలో నిర్ణయాధికారం ఒక ప్రైవేట్ టెక్నాలజీ సంస్థకు ఉండకూడదని తేల్చి చెప్పారు. “సైనిక వ్యూహాలను నిర్దేశించే అధికారం ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికే ఉంటుంది తప్ప, ఏఐ కంపెనీలకు కాదు” అని ఆయన పేర్కొన్నారు. ఆంథ్రోపిక్ వంటి సంస్థలు అమెరికా రక్షణ ప్రయోజనాలకు సహకరించకపోతే, వాటికి ప్రభుత్వ కాంట్రాక్టులు పొందే అర్హత లేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ఈ పరిణామం ఏఐ రంగంలో ‘నైతికత వర్సెస్ జాతీయ భద్రత’ అనే కొత్త చర్చకు తెరలేపింది. భవిష్యత్తులో గూగుల్, ఓపెన్ ఏఐ వంటి ఇతర సంస్థలపై కూడా ఇలాంటి ఒత్తిళ్లు వచ్చే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :