📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Latest Telugu News: Trump VS Putin: నా తడాఖా చూపిస్తా.. పుతిన్‌కు ట్రంప్ త్రీవ హెచ్చరిక

Author Icon By Vanipushpa
Updated: October 24, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపించేందుకు ట్రంప్(Trump) గట్టి పట్టుదల పట్టుకుని కూర్చున్నారు. ఏం చేసినా రష్యా పట్టించుకోకపోవడం ఆయన ఈగోను దెబ్బ తీస్తోంది. దీంతో ట్రంప్ రష్యాపై తీవ్ర ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యారు. ఆ దేశ రెండు అతి పెద్ద చమురు కంపెనీలపై ఆంక్షలను విధించారు. దీనిని తాజాగా వైట్ హౌస్ కూడా సమర్ధించింది. ట్రంప్ తీసుకున్న చర్యలు సముచితమని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలినా లీవిట్ అన్నారు. యుద్ధాన్ని ఆపకపోవడంపై ట్రంప్ చాలా నిరాశగా ఉన్నారని తెలిపారు. రష్యా శాంతి కోసం ఆసక్తి చూపకపోవడాన్ని ఆమె తప్పుబట్టారు. అందుకే ట్రంప్ చర్యలు తీసుకున్నారని సమర్థించారు.

Read Also: Iceland: ఐస్‌లాండ్‌లో కనిపించిన  దోమల పై శాస్త్రవేత్తలు ఏమన్నారంటే..

Trump VS Putin

మేమూ గట్టిగానే బుద్ధిచెబుతాం: పుతిన్

అమెరికా ఆంక్షలపై రష్యా అధ్యక్షుడు పుతిన్(Putin) స్పందించారు. అమెరికాను తాము చాలా గట్టిగా ఎదుర్కొంటామని చెప్పారు రష్యా అధ్యక్షుడు పుతిన్. రష్యాకు సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టినా…దానికి తమ నుంచి తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని చెప్పారు. అమెరికా మాకు అతి పెద్ద శత్రువు…దాని ఆంక్షలకు ఎన్నటికీ తలొగ్గమని అన్నారు. అమెరికా తమ చమురు సంస్థలపై విధించిన ఆంక్షల వలన ఏమీ అవ్వదని…తమ దేశ ఆర్థిక శ్రేయస్సు ఏమీ దెబ్బ తినదని పుతిన్ తెలిపారు. రష్యా ఇంధన రంగంబలంగా ఉందని చెప్పారు. ఈ ఆంక్షలు రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకే అని నాకు తెలుసని..కానీ ఆత్మగౌరవం ఉన్న ఏ దేశం, దాని ప్రజలు ఎప్పుడూ ఒత్తిడికి తలొగ్గదని..అలాగే ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోరని స్పష్టం చేశారు. తమ కంపెనీలపై ఆంక్షలు విధిస్తే..ప్రపంచానికే నష్టమని..ఇంధన సమతుల్యత దెబ్బతిని, ధరలు పెరుగుతాయని పుతిన్ అన్నారు. పుతిన్ వ్యాఖ్యలకు ట్రంప్ తిరిగి గట్టిగా సమాధానమిచ్చారు.

పుతిన్ చరిత్ర ఏమిటి?
పుతిన్ 1999 నుండి 2000 వరకు మరియు మళ్ళీ 2008 నుండి 2012 వరకు రష్యా ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. 2000 నుండి ఆయనను రష్యా వాస్తవ నాయకుడిగా అభివర్ణించారు. పుతిన్ 16 సంవత్సరాలు KGB విదేశీ నిఘా అధికారిగా పనిచేశారు, లెఫ్టినెంట్ కల్నల్ స్థాయికి ఎదిగారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Donald Trump statement international news Latest News Breaking News Putin reaction Russia relations Telugu News Trump Warning US Politics Vladimir Putin

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.