అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజాగా భారత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ, “ఇండియా నా మంచి మిత్రుడు. కానీ చాలా దేశాలతో పోలిస్తే ఇండియా అధిక టారిఫ్‌లు వసూలు చేస్తోంది” అని తెలిపారు. ట్రేడ్ డీల్ అంశంపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ విధంగా స్పందించారు.
డీల్ కుదరకపోతే టారిఫ్ పెంపు తప్పదు
ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య ట్రేడ్ డీల్‌పై చర్చలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇచ్చిన హెచ్చరిక కాస్త గందరగోళాన్ని సృష్టిస్తోంది. “భారత్ డీల్‌కి అంగీకరించకపోతే, 20-25% వరకు టారిఫ్‌లు వసూలు చేస్తాం” అని స్పష్టం చేశారు. ఇది భారత్ ఎగుమతులపై ప్రభావం చూపే అవకాశముంది.
ఆగస్ట్ 1వ తేదీ కీలకం
ఇరు దేశాల మధ్య ట్రేడ్ డీల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ ఇప్పటికే ఆగస్ట్ 1వ తేదీని డెడ్‌లైన్‌గా నిర్ణయించారు. ఆ లోగా టారిఫ్‌లపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ పరిణామాలు వ్యాపార రంగంలో ఉత్కంఠను పెంచుతున్నాయి. ట్రంప్ మాటల ప్రకారం భారత్‌తో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉన్నప్పటికీ, అమెరికా వ్యాపార ప్రయోజనాలపై మాత్రం రాజీ పడేది లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Read Also : Polavaram Project : నేడు పోలవరం ప్రాజెక్టుపై మోదీ సమీక్ష