📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

Tripura Love Triangle Murder: మరో హనీమూన్‌ మర్డర్.. ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం!

Author Icon By Shobha Rani
Updated: June 12, 2025 • 1:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మేఘాలయ హనీమూన్‌ మర్డర్ దేశ వ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మరువకముందే ఇదే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. అగర్తలోని ఇంద్రానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. త్రిపుర (Tripura) రాజధాని అగర్తలకు 120 కి.మీ దూరంలో ఉన్న ధలై జిల్లాలోని గండచ్చెరాలోని ఒక దుకాణంలో ఐస్ క్రీం ఫ్రీజర్‌లో ఓ ట్రాలీ బ్యాగ్‌లో అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. నిందితులు డాక్టర్ దిబాకర్ సాహా (28), అతని తండ్రి దీపక్ (52), తల్లి దేబికా (40), నబానితా దాస్ (25), జోయ్‌దీప్ దాస్ (20), అనిమేష్ యాదవ్ (21)గా పోలీసులు గుర్తించారు.
హత్యకు దారి తీసిన మూలకారణం
అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న అగర్తలకు చెందిన షరిఫుల్ ఇస్లాం (20) అనే యువకుడు జూన్‌ 8న అదృశ్యమయ్యాడు. దీంతో జూన్‌ 9న క్యాపిటల్ కాంప్లెక్స్ (ఎన్‌సిసి) పోలీస్ స్టేషన్‌ (Police station) లో మిస్సింగ్ కేసు నమోదైంది. దిబాకర్ సాహా(28) అనే వైద్యుడు మరో మహిళ, షరిపుల్ మధ్య నడిచిన ట్రయాంగిల్‌ లవ్‌స్టోరీ ఈ హత్యకు దారి తీసినట్లు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) కిరణ్ కుమార్ తెలిపారు. షరిపుల్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సమీప బంధువైన దిబాకర్ సాహా కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. వీరిరువురి మధ్య నడచిన ఫోన్‌ (Phone) సంభాషణలను పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దిబాకర్‌ ప్రియురాలిని దక్కించుకోవడానికి షరిపుల్‌ అడ్డు తొలగించాలని భావించాడు. ఇందుకోసం పక్కా స్కెచ్‌ వేశాడు.

Tripura Love Triangle Murder: మరో హనీమూన్‌ మర్డర్.. ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం!

హత్య & మృతదేహం దాచిన పద్ధతి
ఇంద్రానగర్‌లోని జోయ్‌దీప్ ఇంట్లో కలుద్దామని షరిపుల్‌కు ఫోన్‌ చేశాడు. ఇంటికి వచ్చిన అతడిని సాహా జోయ్‌దీప్, నబనిత, అనిమేష్ గొంతు కోసి హత్య చేశారు. తర్వాత అతడి చేతులు కట్టి, మృతదేహాన్ని ట్రావెల్‌ బ్యాగ్‌లో ప్యాక్‌ చేసి దిబాకర్, అతని తల్లిదండ్రులు కలిసి గండచెర్రకు ఆ బ్యాగ్‌ను తీసుకెళ్లారు. అనంతరం ఆ సూట్‌కేస్‌ను అతని తండ్రి దుకాణంలోని ఐస్‌ క్రీం ఫ్రిజ్‌లో భద్రపరిచారు. ఈ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. దిబాకర్‌ తల్లిదండ్రులతో సహా ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో మరో మహళ కూడా ఉంది. మంగళవారం రాత్రి ఆరుగురు నిందితులను అరెస్టు చేసి షిరిఫుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టు ముందు హాజరుపరచనున్నారు. ముగ్గురు మధ్య నడచిన ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారితీసినట్లు మొబైల్ సందేశాల ద్వారా పోలీసులు గుర్తించారు.
సంఘటనపై విశ్లేషణ: సామాజిక పరిశీలన
ప్రేమ వ్యవహారాలు, అసూయతో మానవులు కిరాతకంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. కుటుంబ సభ్యులు కూడా హత్యలో భాగం కావడం, సంఘటనా తీవ్రతను మరింత పెంచుతోంది. ఐస్‌క్రీం ఫ్రీజర్‌లో మృతదేహం దాచిన తీరు దారుణమైన క్రిమినల్ మైండ్‌సెట్‌కు నిదర్శనం.ఈ సంఘటన త్రిపుర (Tripura)రాష్ట్రాన్ని మరియు దేశాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది. ప్రేమ విషయంలో తట్టుకోలేని అసూయ, హత్య వరకు తీసుకెళ్లిన ఈ ఘటన, సామాజిక విలువలు, సంబంధాల విలువపై ఆలోచింపజేస్తోంది.

Read Also: Raja Raghuvanshi: సోదరుడి హత్యపై శ్రస్తి రఘువంశీ

Another honeymoon murder.. Body found in ice cream freezer! Breaking News in Telugu Google news Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.