📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Telugu News:Transco: ట్రాన్స్‌కో బలోపేతమే లక్ష్యం: సూర్య సాయి ప్రవీణ్ చంద్

Author Icon By Pooja
Updated: October 14, 2025 • 11:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

విజయవాడ : ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరంతరం నాణ్యమైన, నమ్మకమైన, నిరంతర విద్యుత్ సరఫరాను సమర్థవంతంగా కొనసాగించడంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్ (Transco)మిషన్ కార్పొరేషన్ (ఏపీట్రాన్స్కో) నిరంతర అభివృద్ధికి, సంస్థను మరింత బలోపేతం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని ఏపిట్రాన్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ జి. సూర్య సాయి ప్రవీణ్ చంద్ తెలిపారు. ఏపి ట్రాన్స్కో కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా సోమవారం స్థానిక విద్యుత్ సౌధలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ ప్రసార నెట్వరన్ను బలోపేతం చేయడం, ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచడం, నాణ్యతా ప్రమాణాలను పాటించడం కోసం ఏపిట్రాన్స్కో (Transco) అనేక ఉత్తమ పద్ధతులను అమలు చేస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది అందరి సమిష్టి కృషితో ఏపిట్రాన్స్కో దేశంలోనే అగ్రభాగాన నిలుస్తుందని, ధీమా వ్యక్తం చేశారు.

Read Also: EAPCET 2025: ఎప్ సెట్ మొదటి ఫేజ్ కౌన్సెలింగ్ 10,012 సీట్ల కేటాయింపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్లు తనపై విశ్వాసం ఉంచి ఈ బృహత్తర బాధ్యతలు తనకు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇంధన రంగ లక్ష్యాలను సాధించేందుకు పూర్తి నిబద్ధతతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఏపిట్రాన్స్కో అభివృద్ధికి ఉద్యోగులందరి సహకారం, టీమ్ వర్క్ ప్రధాన బలంగా ఉంటాయని ఆయన పేర్కొంటూ అధికారులు, ఇంజినీర్లు, సిబ్బంది అందరూ సమిష్టిగా, కొత్త ఉత్సాహంతో కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విద్యుత్ రంగంలో(Electricity sector) సేవ చేయడం ఒక గొప్ప అవకాశం గా భావిస్తున్నానని, రాష్ట్ర అభివృద్ధి కి అనుగుణంగా విద్యుత్ ప్రసార, మోలిక సదుపాయాల పురోగతికి కృషి చేస్తానని తెలిపారు.

ఈ సందర్భంగా ఏపి ట్రాన్స్కో డైరెక్టర్లు ఏ కె వీ భాస్కర్, జె వీ రావు ఎన్ వీ రమణ మూర్తి. ఏ పీ ట్రాన్స్కో అడిషనల్ సెక్రటరీ పెద్ది రోజా, విద్యుత్ సంస్థల సీనియర్ అధికారులు, సిబ్బంది ప్రవీణ్ చంద్కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ప్రవీణ్ చంద్ 2019 బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) అధికారి, ఆంధ్రప్రదేశకు చెందిన ఆయన ఐఐటీ పాట్నా పాట్నా నుండి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో బాచిలర్ డిగ్రీ పొందారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ వరీక్ష 2018లో ఆల్ ఇండియా 64వ ర్యాంక్ సాధించి 27 ఏళ్ల వయసులో ఐఏఎస్గా చేరారు. తన సర్వీస్ లో అనేక కీలక పదవులను నిర్వర్తించారు అనంతపురం అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైనింగ్ లో), మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్ మెంట్ శాఖలో అండర్ సెక్రటరీ, విజయవాడ సబ్ కలెక్టర్, కడప మునిసిపల్ కమిషనర్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (ఏపీసీఆర్డీఏ) అదనపు కమిషనర్గా పనిచేస్తూ ఏపీ ట్రాన్స్కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గా నియమితులయ్యారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Andhra Pradesh electricity power supply Telugu News Today news Transco

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.