దేశవ్యాప్తంగా వాతావరణ మార్పులు భూగోళానికి సవాలు విసురుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు ఒకవైపు, అకాల వర్షాలు మరొకవైపు. ఈ రెండింటి దెబ్బకు ఋతువులు గతి తప్పుతున్నాయి. ప్రకృతి పగబట్టి అన్నదాతల ఆరుగాలం శ్రమను ముంచేస్తోంది. దీని ప్రభావంతో దేశంలో ఆహార ద్రవ్యోల్బణం పెరిగి, కూరగాయల ధరలు ఎగిసే అవకాశం ఉందని కైమేట్ ట్రెండ్స్ నివేదిక హెచ్చరించింది. 2022-23లో వేడి తీవ్రత సాధారణంకంటే 30రెట్లు అధికంగా నమోదైంది. గత 40ఏళ్లలో 30శాతం జిల్లాల్లో తక్కు వ వర్షపాతం, మరోవైపు కొన్ని జిల్లాల్లో అతివృష్టి పెరిగిందని గణాంకాలు తెలుపుతున్నాయి. వర్షాధారంగా సాగుచేస్తు న్న 15-40శాతం ప్రాంతాల్లో 2050 నాటికి ప్రస్తుత పద్ధ తులు అనుకూలం కాని పరిస్థితి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది వానాకాలం ప్రారంభంలో నిరాశ పరిచినా, చివర్లో విరుచుకుపడి రైతులను ముంచింది. జూన్లో వర్షాల మధ్య విరామాలు ఉండగా, తర్వాత ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనాలు, ద్రోణాలతో రాష్ట్రవ్యాప్తంగా భారీవర్షాలు (Torrential rains)కురిశాయి. రాష్ట్ర సగటు వర్షపాతం 740.6 మి.మీ. కాగా, 33 శాతం అధికంగా 988.3 మి.మీ. నమోదైంది. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టగా, అక్టోబర్15లోపు పూర్తిగా నిష్క్రమించనున్నాయి. నారాయణ పేట జిల్లా మరికల్లో 64.8 మి.మీ., మహబూబ్నగర్ ముసాపేటలో 63.6 మి.మీ., దేవరకద్రలో 63.1 మి.మీ. వర్షపాతం నమోదయింది. రాష్ట్రవ్యాప్తంగా 137 మండలాల్లో అత్యధిక వర్షాలు (60పైగా), 294 మండలాల్లో అధిక వర్షాలు (20-59), 187 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇలా ప్రకృతి పగతో రైతులు విలవిలలాడుతున్నారు.
అతివృష్టి దెబ్బ
ముందస్తు వర్షాలు, అధిక వర్షాల (Torrential rains) పరిస్థితుల్లోనూరైతన్నకు నష్టమే. మొదట్లో పత్తి సాగు ఉత్సాహంగా సాగినప్పటికీ, రెండు నెలల వర్షాభావం పంటల ఎదుగుదల దెబ్బతీసింది. ఇప్పుడు తిరిగి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు పంటలను పూర్తిగా నాశనం చేస్తున్నాయి.పత్తి చేలల్లో మొలకలు వస్తున్నాయి, మొక్కజొన్న కుళ్లిపోతోంది. మిర్చి మొక్కలు కాయలతోనే కూలిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుత సీజన్లో 45.47 లక్షల ఎకరాల్లో పత్తి, 6. 44 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న, 1.2 లక్షల ఎకరాల్లోమిరప సాగు జరిగింది. పంటలపై క్రమపద్ధతిలో వర్షాభావం-అతివృష్టి దెబ్బ తగిలి రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. నీటితో నిండిన పొలాల్లో వేర్లు ఊపిరాడక పంటలు పాడైపోతున్నా యి. పత్తిలో రసంపీల్చే పురుగులు, మొక్కజొన్నలోకాండం కుళ్లు వ్యాపించాయి. ఇది కేవలం వ్యవసాయ సమస్య మాత్ర మేకాదు, వాతావరణ సంక్షోభానికి సంకేతం కూడా.
మానవ జాతి మనుగడకే ముప్పు
అకాల వర్షాలు, భూకంపాలు, ఆమ్లవర్షాలు ఇవన్నీ మానవ జాతి మనుగడకే ముప్పుతెస్తున్నాయి. ఈ పరిణామాలపైప్రపంచ స్థాయిలో చర్చించి నివారణ చర్యలు చేపట్టడం అత్యవసరం. ప్రభుత్వాలు శీఘ్రప్రగతి పేరుతో సహజ వనరుల నాశనానికి దారితీసే పారిశ్రామికీకరణను నియంత్రించాలి. భూతా ప ఉద్గారాలను తగ్గించే విధానాలు రూపకల్పనచేయాలి. వాతావరణ మార్పులను తట్టుకునే రకాలవిత్తనాలను ప్రోత్స హించి, గ్రీన్ హౌస్ సాగు, రక్షిత వ్యవసాయ పద్ధతులు విస్తరించాలి. రైతులకు కోల్డ్ స్టోరేజీలు, శీతల రవాణా వసతు లు, మెరుగైన సరఫరా గొలుసు వ్యవస్థలు అందుబాటులో ఉండాలి. మానవ మనుగడను కాపాడేమార్గం ప్రకృతిని గౌర వించడం ద్వారానే సాధ్యం. అందరూ తమవంతు బాధ్యత నిబద్ధతతో నిర్వర్తించినప్పుడే జీవకోటి నిలబడగలదు.
-మేకిరి దామోదర్
అధిక వర్షపాతం వల్ల రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటి?
భారీ వర్షాలు పొలాలను ముంచెత్తడం, నేలలోని పోషకాలను కోల్పోవడం మరియు తెగుళ్ళు మరియు వ్యాధుల వ్యాప్తి పెరగడం ద్వారా పంటలను దెబ్బతీస్తాయి, దీని వలన దిగుబడి తగ్గుతుంది .
రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి?
వ్యవసాయ ధరలు వేగంగా తగ్గడం , వారు కొనుగోలు చేయడానికి అవసరమైన వస్తువులపై అధిక సుంకాలు మరియు విదేశీ పోటీ కారణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులను వారు ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొన్న అతిపెద్ద సవాళ్లలో ఒకటి అధిక ఉత్పత్తి, ఇక్కడ మార్కెట్‌లో వారి ఉత్పత్తుల సమృద్ధి ధరలను మరింత తగ్గించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: