📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirupati : పుట్టగొడుగుల పరిశోధన కేంద్రంగా శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల

Author Icon By Saritha
Updated: October 24, 2025 • 11:12 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వి.పి శర్మ

తిరుపతి : భారత వ్యవసాయ పరిశోధనా మండలి ఆధ్వర్యంలో జాతీయ పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం ద్వారా శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలలో(Tirupati) పుట్టగొడుగుల పెంపకంపై 2014 సంవత్సరం నుంచి పరిశోధన నిర్వహిస్తున్నట్టు ఎన్టీరంగా వర్సిటీ ఉపకులపతి డాక్టర్ ఆర్.శారద జయలక్ష్మీదేవి తెలిపారు. పుట్టగొడుగుల జాతీయ పరిశోధన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వి.పి శర్మతో కలిసి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నందు ఏర్పాటుచేసిన పుట్టగొడుగుల పరిశోధన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఉపకులపతి మాట్లాడుతూ 2014 సంవత్సరం నుంచి ఈ పరిశోధన కేంద్రం ద్వారా రైతులకు, యువకులకు గ్రామీణ మహిళలకు శిక్షణతో పాటు స్వయం ఉపాధిగా పుట్టగొడుగుల పెంపకాన్ని ఎంచుకున్న యువతకు సలహాలు సూచనలు అందిస్తున్నామని తెలిపారు.

Read also: అవినాశ్ రెడ్డి ఇతర నిందితులకు నోటీసులు పంపిన సీబీఐ

Tirupati : పుట్టగొడుగుల పరిశోధన కేంద్రంగా శ్రీవెంకటేశ్వర వ్యవసాయ కళాశాల

పుట్టగొడుగుల పరిశోధన ప్రాధాన్యం

పుట్టగొడుగులలో 35 శాతం ప్రొటీన్ ఉంటుందని, మన రాష్ట్రంలో బటన్ అయిస్టర్ పాల పుట్టగొడుగులను ఎక్కువగా వాడుతున్నారని వివరించారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)రాష్ట్రంపుట్టగొడుగుల(Tirupati) పెంపకానికి ఎంతో అనుకూలంగా ఉంటుందని, యువత ఈ రంగంలో స్వయం ఉపాధి పొందడంతో పాటు దీనిని ఒక వ్యాపారంగా నిర్వహించడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలియజేశారు. ఇక్కడి పుట్టగొడుగుల పరిశోధన కేంద్రం నందు విత్తన ఉత్పత్తి (స్పాన్) కూడా చేపట్టడానికి గల అవకాశాలను పరిశీలిస్తున్నామని తెలియజేశారు. అనంతరం జాతీయ పుట్టగొడుగులు పరిశోధన కేంద్రం, సోలాన్, హిమాచల్ప్రదేశ్, డైరెక్టర్ డాక్టర్ విపి కర్మ మాట్లాడుతూ భారతదేశంలో ప్రస్తుతం. సంవత్సరానికి నాలుగు లక్షల టన్నుల పుట్టగొడుగుల ఉత్పత్తి జరుగుతున్నదని వివరించారు.

రైతులకు, యువతకు స్వయం ఉపాధి అవకాశాలపై శిక్షణ

పుట్టగొడుగుల ఉత్పత్తిని పెంచడానికి వాతావరణ పరంగా ఆంధ్ర రాష్ట్రం ఎంతో అనుకూలమైనదని తెలిపారు. ఈ సాగును చేపట్టడానికి అధిక స్థలం అవసరం లేదని, తక్కువ పెట్టుబడితో వ్యవసాయ వ్యర్థాలను వినియోగించుకొని స్వయం ఉపాధిగా చేపట్టవచ్చని పేర్కొన్నారు. ఈ రంగంలో ఎంటర్ప్రెన్యూర్స్ ఎదగడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. అంతేకాకుండా పుట్టగొడుగులకు ఉన్న గణనీయమైన పోషక విలువల కారణంగా ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు విటమిన్ బి 12. డి విటమిన్ పుష్కలంగా ఉండాయన్నారు. కొన్ని రకాల పుట్టగొడుగులకు ఉన్న ఔషధ గుణాల వలన ఆంధ్రప్రదేశ్లో పుట్టగొడుగుల సాగుకు విస్తృతమైన అవకాశాలు ఉన్నాయని, అందువలన తిరుపతి వ్యవసాయ కళాశాల నందు గల స్వచ్చంద పరిశోధనా కేంద్రాన్ని ప్రధాన పరిశోధన కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనను సిద్ధం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పుట్టగొడుగులపై జరుగుతున్న పరిశోధనలను క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచనలు ఇచ్చాడు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ ఎం రెడ్డి శేఖర్, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ వి సుమతి, అధ్యాపక పరిశోధన సిబ్బంది పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Latest News in Telugu MushroomResearch SriVenkateswaraUniversity Telugu News TirupatiAgriculture

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.