📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Latest news: Tirumala: ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

Author Icon By Saritha
Updated: October 31, 2025 • 11:16 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి
ఆరురకాల పత్రాలు, 16 రకాల పుష్పాలతో స్వామివారికి పుష్పార్చన

తిరుమల : కలియుగవైకుంఠవాసుడు శ్రీవేంకటేశ్వరస్వామికి తిరుమల(TTD) కార్తీకమాసంలో శ్రవణానక్షత్రాన జరిపే పుష్పయాగమహోత్సవం గురువారం మధ్యాహ్నం శాస్త్రోక్తంగా ఆలయంలో చేపట్టారు. సువాసనలు వెదజల్లే 16 రకాల పుష్పాలు, ఆరురకాల పత్రాలతో(Tirumala) శ్రీదేవిభూదేవిసమేత ఉత్సవమూర్తులు మలయప్పస్వామికి వేడుకగా పుష్పార్చన నిర్వహించారు. రంగురంగుల పుష్పాలు, పత్రాల మధ్య స్వామిఅమ్మవార్లు వైభవం మరింత ఇనుమడింపజేసింది. మధ్యాహ్నం 1గంట నుండి సాయంత్రం 4గంటల వరకు కల్యాణోత్సవమండపంలో మహోత్సవం కన్నులపండువగా జరిగింది.

Read also: దరఖాస్తు గడువు పొడిగింపు – నవంబర్ 6వరకు అవకాశం

Latest news: Tirumala: ఆరురకాల పత్రాలతో పుష్పయాగం

తిరుమలలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం

ఉత్సవమూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలతో అలంకరించి పుష్పకైంకర్యం చేశారు. చామంతి, సంపంగి, రోజా, గన్నేరు, మల్లె, ముల్లెలు, కనకాంబరం, తామర,మానుసంపంగి, ఇతరపుష్పాలు, తులసి, మరువం, దవణం, బిల్వం, పన్నీరు, కదిరిపచ్చ పత్రాలతో(Tirumala) ఉత్సవమూర్తులను అభిషేకించారు. వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, కృష్ణవేదం, సామవేదం అధర్వణవేదాలను పఠిస్తుండగా 20 సార్లు వివిధ రకాల పుష్పాలతో అర్పించారు. ఉత్సవమూర్తుల నిలువెత్తు వరకు ఉండేలా పుష్పనివేదన చేశారు. పుష్పయాగానికి 9టన్నుల పుష్పాలు, పత్రాలను దాతలు అందించారు. శ్రీవారి పుష్పయాగ మహోత్సవానికి పుష్పాలు సేకరించిన ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసనన్ను అభినందించారు. ఈ వేడుకల్లో టిటిడి ఇఒ అనిల్కుమార్సింఘాల్ దంపతులు, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఆలయ పేష్కార్ రామకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకుడు వేణుగోపాలదీక్షితులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అంతకుముందు ఉదయం పాపవినాశనం మార్గంలోని ఉద్యానవనం నుండి పుష్పాలను భక్తితో ఊరేగింపుగా ఆలయంలోనికి చేర్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Flower Festival Hindu festival Karthika Masam Latest News in Telugu Lord Venkateswara Pushpayagam Srivari temple Telugu News tirumala Tirumala temple TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.