తిరుమలలో సోమవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షాల కారణంగా మంగళవారం ఉదయం ఘాట్ రోడ్డులో ఒక దురదృష్టకర సంఘటన జరిగింది. కొండ(Tirumala) పైకి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఒక వ్యక్తిపై కొండ పైనుంచి రాయి దొర్లుకుంటూ వచ్చి పడింది. దీంతో అతడికి తల, శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన తోటి భక్తులు మరియు వాహనదారులు వెంటనే టీటీడీ(TTD) సిబ్బందికి, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాయపడిన వ్యక్తిని అధికారులు తిరుమల లగేజ్ సెంటర్‌లో వెండార్‌గా పనిచేసే లోకేశ్‌గా గుర్తించారు.
Read also: చలికాలంలో ఖర్జూరం షక్తి మూలం
విధి నిర్వహణకు వెళ్తుండగా ఘటన: ఆసుపత్రిలో లోకేశ్
మంగళవారం ఉదయం విధి నిర్వహణ కోసం బయలుదేరిన లోకేశ్, రెండో ఘాట్(Tirumala) రోడ్డులోని హరిణి ప్రాంతం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. కొండ పైనుంచి వర్షం కారణంగా జాలువారిన రాయి అతడిపై పడటంతో, లోకేశ్ బైక్ పైనుంచి కిందపడ్డాడు. అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అంబులెన్స్ ద్వారా అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. లోకేశ్‌కు చికిత్స అందిస్తున్న స్విమ్స్ వైద్యులు, ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడని తెలియజేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: