📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Vijayashanti : ఎమ్మెల్సీ విజయశాంతి భర్తకు బెదిరింపులు

Author Icon By sumalatha chinthakayala
Updated: April 12, 2025 • 8:22 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Vijayashanti : డబ్బులు ఇవ్వకపోతే కసి తీరేంతవరకు అతి దారుణంగా చంపేస్తానంటూ ఎమ్మెల్సీ విజయశాంతి భర్తను ఓ వ్యక్తి బెదిరించాడు. దాంతో అతడిపై బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయశాంతి భర్త ఎం. వి శ్రీనివాస ప్రసాద్‌కు నాలుగేళ్ల క్రితం ఎం చంద్రకిరణ్‌ రెడ్డి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సోషల్‌ మీడియాలో ప్రమోషన్స్‌ చేస్తానని చంద్రకిరణ్‌ చెప్పుకున్నాడు. పనితీరు చూశాక కాంట్రాక్ట్‌ ఇస్తామని చంద్రకిరణ్‌కు శ్రీనివాస ప్రసాద్‌ చెప్పాడు. కొద్దిరోజుల తర్వాత అనుకున్న స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో అతడితో ఎలాంటి ఒప్పందం చేసుకోకుండా పంపించేశారు.

కసితీరే వరకు అతి దారుణంగా చంపుతా

కానీ, చంద్రకిరణ్‌ మాత్రం తాను విజయశాంతి కోసం సోషల్‌ మీడియాలో పనిచేస్తున్నాని చెప్పుకుంటూ పలువురు రాజకీయ ప్రముఖుల వద్ద కాంట్రాక్టులు కుదుర్చుకున్నాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం.. తనకు డబ్బులను ఎప్పుడు చెల్లిస్తారంటూ శ్రీనివాసప్రసాద్‌కు చంద్రకిరణ్‌ రెడ్డి మెసేజ్‌ చేశాడు. ఎటువంటి ఒప్పందం లేకుండానే చంద్రకిరణ్‌ డబ్బులు అడగడంతో ఇంటికొచ్చి మాట్లాడాలని శ్రీనివాస్ ప్రసాద్ మెసేజ్‌లో సూచించగా, అతడు రాలేదు. ఇటీవల నాకు డబ్బులు ఇవ్వకపోతే మీ బతుకులు రోడ్డు కీడుస్తా.. కసితీరే వరకు అతి దారుణంగా చంపుతాను అంటూ చంద్ర కిరణ్‌ రెడ్డి మెసేజ్‌ ద్వారా బెదిరించాడు. దాంతో శ్రీనివాసప్రసాద్‌ బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: సన్నబియ్యం పంపిణీకి స్పందన అద్భుతం – మంత్రి ఉత్తమ్

Google news Google News in Telugu Latest News in Telugu MLC Vijayashanti husband Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Threats Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.