నంబియో క్రైమ్ ఇండెక్స్–2025 (Numbeo Crime Index) ప్రకారం అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. క్రైమ్ రేట్లు తక్కువగా ఉండడం, ప్రజలకు అధిక భద్రత కల్పించడంలో సాంకేతిక పద్ధతుల వినియోగం, పాలనలో పారదర్శకత వంటి అంశాల కారణంగా అబుదాబి ఈ ఘనత సాధించింది. దోహా, దుబాయ్, షార్జా వంటి ఇతర గల్ఫ్ నగరాలు కూడా టాప్–10లో చోటు దక్కించుకోవడం విశేషం.
అగ్రనగరాల జాబితాలో ఆసియా దేశాలకు ప్రాధాన్యం
టాప్–10 సురక్షిత నగరాల్లో తైపే (తైవాన్), మస్కట్ (ఒమన్), మనామా (బహ్రేన్), ట్రోండైమ్, ది హేగ్ (నెదర్లాండ్స్) లాంటి నగరాలు చోటు చేసుకున్నాయి. ఈ నగరాలు తమ భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడంలో విజయం సాధించాయి. ప్రజా ఆస్తుల రక్షణ, సీసీ టీవీ నెట్వర్క్‌లు, శీఘ్ర పోలీసు స్పందన వ్యవస్థలు, సైబర్ భద్రత వంటి అంశాల్లో మేటిగా నిలవడం వీటికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.
భారత్‌లో అహ్మదాబాద్‌కు ప్రథమ స్థానము
భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నిలిచింది. తరువాత స్థానాల్లో జైపూర్, కోయంబత్తూర్, చెన్నై, పుణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ దేశవ్యాప్తంగా అత్యంత భద్రత కలిగిన నగరాల్లో ఒకటిగా నిలవడం గర్వకారణంగా చెప్పవచ్చు. నగరంలోని స్మార్ట్ సిటీ పథకాలు, సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇలా అన్ని కలసి భద్రతను మెరుగుపర్చడంలో సహకరించాయి.
Read Also : Sonia’s Letter : సోనియా లేఖ ఆస్కార్ తో సమానం – రేవంత్