📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Stampede : దేశ క్రీడా చరిత్రలో అతిపెద్ద విషాదం ఇదే

Author Icon By Sudheer
Updated: June 5, 2025 • 8:15 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరులో జరిగిన తొక్కిసలాట (Stampede ) ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. విజయోత్సవం సందర్భంగా ఏర్పడ్డ భద్రతా లోపాల వల్ల 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోవడం దిగ్భ్రాంతికర ఘటనగా మారింది. ఇది కేవలం ఒక ట్రాజెడీ కాదు, దేశంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం కలిగించిన అతి పెద్ద క్రీడా, ప్రజా సమూహ ఘటనల సరళిలో స్థానం సంపాదించింది. ఫ్యాన్స్ ఉత్సాహం ప్రాణహానికీ దారితీయడం పట్ల సర్వత్రా ఆవేదన వ్యక్తమవుతోంది.

కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఘటన

ఈ ఘటనతో దేశ చరిత్రలో మరో మరిచిపోలేని దుర్ఘటన గుర్తుకొస్తోంది. 1980 ఆగస్ట్ 16న కోల్కతా ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ (Kolkata football tragedy) సందర్భంగా రెండు జట్ల అభిమానులు గొడవ పడ్డారు. ఈ తోపులాట, ఆందోళనల్లో 16 మంది మరణించడం అప్పట్లో దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. అదే ఏడాది జరిగిన ఈ ఘటన ‘ఇండియన్ స్పోర్ట్స్ హిస్టరీ’లోనే అత్యంత విషాదకర ఘటనగా నమోదైంది. ఇక 1969లో ఆస్ట్రేలియా-ఇండియా టెస్ట్ మ్యాచ్ టికెట్ల కోసం ఎదురైన తొక్కిసలాటలో 6 మంది మృతి చెందడం ఇంకొక ఉదాహరణ.

భద్రత లోపల వల్లే ఇలాంటి ప్రమాదాలు

ఇవన్నీ చూస్తే.. పెద్ద ఇవెంట్ల నిర్వహణలో భద్రత, ప్రణాళికలలో ఎక్కడెక్కడ లోపాలు జరుగుతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వాలు, నిర్వాహకులు, భద్రతా వ్యవస్థలు క్రీడా, వినోద కార్యక్రమాలను సజావుగా నడిపించాలంటే భద్రతపై అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతిసారి ఈ తరహా ఘటనల తర్వాత మాత్రమే స్పందించడం కాదు, ముందు జాగ్రత్త చర్యలతో ప్రాణాలు కాపాడే ప్రయత్నాలు జరగాలి. లేదంటే అభిమానుల ఉత్సాహం ఒక విషాదానికి దారి తీస్తూనే ఉంటుంది.

Read Also : Jobs : CISFలో 403 ఉద్యోగాలు.. రేపే లాస్ట్

1980 august 16 bangalore stampede eden gardens match Google News in Telugu Kolkata football tragedy Stampede

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.