దీపావళి పండుగ హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మరియు ఆనందభరితమైన పండుగగా పరిగణించబడుతుంది. ఈ రోజు ప్రతి ఇంటి ఆవరణ వెలుగులతో మెరిసిపోతుంది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు అందరూ ఒకచోట చేరి ఆనందంగా వేడుకలు జరుపుకుంటారు. దీపావళి పండుగ ప్రధాన ఉద్దేశం చీకట్లను తొలగించి వెలుగును ఆహ్వానించడం, అంటే అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని స్వీకరించడం. ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా సంపద, శ్రేయస్సు, సుఖశాంతులు లభిస్తాయని నమ్మకం. పితృదేవతలకు దీపాలు చూపించి వారి ఆశీస్సులు పొందడం కూడా ఈ రోజున ప్రత్యేక ఆచారం.
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 20 అక్టోబర్ 2025 Horoscope in Telugu
పండితుల ప్రకారం, దీపావళి రోజు లక్ష్మీపూజకు విశిష్టమైన సమయాన్ని పాటించడం ఎంతో ముఖ్యమని సూచిస్తున్నారు. సాయంత్రం 7 గంటల నుండి రాత్రి 8.30 గంటల వరకు లక్ష్మీపూజ చేయడం అత్యంత శుభప్రదమని వారు చెబుతున్నారు. ఈ సమయాన్ని మహాలక్ష్మీ ప్రదోషకాలంగా పరిగణిస్తారు. ఈ సమయంలో కుటుంబసభ్యులు అందరూ కలిసి పూజ చేసి దీపాలను వెలిగిస్తే ఆ ఇంటిలో శాంతి, ఆనందం, ఐశ్వర్యం వర్థిల్లుతాయని విశ్వాసం. ఇంటి తలుపుల వద్ద, దేవాలయంలో, ఆవరణలో దీపాలు వెలిగించడం పాజిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తుందని పండితులు చెబుతున్నారు.
ప్రదోషకాలం సాయంత్రం 5.45 గంటల నుండి రాత్రి 8.15 గంటల వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో చేసే పూజలు, దీపదానం విశేషమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం ముందు కుంకుమ, పసుపు, పూలతో పూజ చేసి, పాలు, మిఠాయిలను నైవేద్యంగా సమర్పించడం శుభప్రదం. దీపాలను దానం చేయడం, పేదవారికి ఆహారం లేదా వస్త్రాలు ఇవ్వడం ఈ రోజు అత్యంత పుణ్యకార్యం. దీపావళి పండుగ కేవలం వెలుగుల వేడుక మాత్రమే కాక, భక్తి, దాతృత్వం, కుటుంబ ఐక్యతను ప్రతిబింబించే ఆధ్యాత్మిక ఉత్సవం.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/