తెలుగుదేశం పార్టీ నేత మరియు మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కడప మహానాడులో ప్రజలనుద్దేశించి చేసిన ప్రసంగం రాజకీయంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. తన ప్రసంగంలో ఆయన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. “టీడీపీని మేము లేకుండా చేస్తామన్నారు కానీ చివరికి వాళ్లే అడ్రెస్ లేకుండా పోయారు” అంటూ చురకలంటించారు. రాయలసీమ మహానాడు సబలంగా సాగిందని, ఇది పసుపు సైన్యం పౌరుషానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.
అభివృద్ధికి ప్రభుత్వం కొనసాగింపు అవసరం
లోకేష్ తన ప్రసంగం (Lokesh Speech)లో అభివృద్ధి పై గట్టి దృష్టి పెట్టారు. రాష్ట్ర అభివృద్ధికి నిరంతర ప్రభుత్వ పాలన అవసరమని, ప్రభుత్వం మారితే పరిశ్రమలు, పెట్టుబడులు రావడం కష్టమవుతుందన్నారు. చంద్రబాబు జీవితం ప్రజల కోసమే అని అన్నారు. సీబీఎన్ అంటే అభివృద్ధి, ధైర్యం అని చెప్పుకొచ్చారు. ఆయన ప్రభుత్వ తలుపులు కార్యకర్తల కోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని హామీ ఇచ్చారు.
క్యాడర్‌కు పిలుపు – వినయంగా ప్రజలకు చేరువ కావాలి
పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేసిన లోకేష్, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టు పని చేయాలన్నారు. అహంకారం పక్కనపెట్టి ప్రజలకు దగ్గరవ్వాలని, పని చేసే వారిని ప్రోత్సహిస్తానని తెలిపారు. సీనియర్లను, జూనియర్లను సమానంగా చూస్తానని స్పష్టం చేశారు. రాయలసీమ డిక్లరేషన్‌పై తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. మహానాడు వేదికగా తన మాటలతో లోకేష్ పార్టీ భవిష్యత్ వ్యూహాన్ని స్పష్టంగా తెలియజేశారు.
Read Also : Gaddar awards : తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన ఎన్టీఆర్