📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే

Author Icon By Sudheer
Updated: February 26, 2025 • 5:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఉదయం 8 గంటల నుండి ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికలకన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసే విధానం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. బ్యాలెట్ పేపర్ విధానం ఉండటంతో చిన్న పొరపాటు జరిగినా ఓటు చెల్లని ప్రమాదం ఉంటుంది. గతంలో కూడా అనేక మంది ఓటర్లు తగిన అవగాహన లేకపోవడంతో వేల సంఖ్యలో ఓట్లు చెల్లకుండా పోయాయి. ముఖ్యంగా పట్టభద్రులు, ఉపాధ్యాయులు తమ ఓటు సరిగా వేయాలంటే కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి.

బ్యాలెట్ పేపర్‌లో ఓటు వేయడంలో ముఖ్యమైన నియమాలు


ఈ ఎన్నికల్లో ఇవీఎంలు లేకుండా, కేవలం బ్యాలెట్ పేపర్ ద్వారానే ఓటింగ్ జరుగుతుంది. ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయాలి. ముందుగా అత్యంత నచ్చిన అభ్యర్థికి “1” నెంబర్ ఇవ్వాలి. ఆపై ఇతర అభ్యర్థులకు 2, 3, 4 వంటివిగా ప్రాధాన్యత క్రమంలో నెంబర్ ఇవ్వవచ్చు. అయితే ఒకరికి కేటాయించిన సంఖ్య వేరొకరికి ఇవ్వరాదు. అలాగే రోమన్ సంఖ్యలు (I, II, III), అక్షరాలు (One, Two) వాడకూడదు. టిక్కులు (✔️) పెట్టడం, సున్నాలు గీయడం వంటి తప్పిదాలు చేస్తే ఆ ఓటు చెల్లదు.

పోలింగ్ కేంద్రంలో పాటించాల్సిన నియమాలు


ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే ముందు తప్పనిసరిగా ఎన్నికల సంఘం అనుమతించిన గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. అంధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఒక సహాయకుడిని వెంట తీసుకెళ్లవచ్చు. పోలింగ్ కేంద్రంలో మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతించబడవు. ఓటింగ్ ప్రక్రియలో ఏ చిన్న పొరపాటైనా మీ ఓటును చెల్లనిదిగా మార్చే ప్రమాదం ఉంది. అందుకే పూర్తి జాగ్రత్తలతో, నియమాలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకోవాలి.

Google news MLC Election

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.