📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Lulu Mall : విజయవాడలోనూ లులు మాల్ కు స్థలం!

Author Icon By Sudheer
Updated: July 28, 2025 • 8:18 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌లో లులు గ్రూప్ పెట్టుబడులు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇప్పటికే విశాఖపట్నంలో లులు మాల్ (Lulu Mall)నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ఈ సంస్థ, ఇప్పుడు విజయవాడ నగరంలో కూడా తమ మాల్ ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ సమీపంలో ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాల భూమిని లులు గ్రూప్‌కు లీజుకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు సమాచారం. దీనికి సంబంధించి అధికారిక ప్రక్రియలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

ఆర్టీసీ భూమి – లులుకు లీజుకు

విజయవాడలో లులు మాల్ కోసం RTCకి చెందిన స్థలాన్ని ఎంచుకున్న ప్రభుత్వం, అక్కడ ఉన్న ప్రస్తుత నిర్మాణాలను ఇతర ప్రాంతానికి తరలించాలని నిర్ణయించింది. ఇందుకోసం జిల్లా కలెక్టర్కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు పలు పత్రికల్లో వార్తలు వచ్చాయి. ప్రభుత్వ నిర్ణయంతో విజయవాడ నగరంలో పర్యాటక రంగం, వాణిజ్య కార్యకలాపాలకు కొత్త ఊపొస్తుందని భావిస్తున్నారు. ఈ స్థలాన్ని పర్యాటక శాఖకు అప్పగించి, లులుకు మాల్ నిర్మాణానికి అనువుగా లీజుపై ఇవ్వనున్నారు.

పర్యాటకానికి పెరుగుతున్న ప్రాధాన్యం

వాణిజ్య రంగానికి తోడు పర్యాటక అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడనుందని అధికారులు చెబుతున్నారు. లులు మాల్ ద్వారా స్థానిక ప్రజలకు ఉన్నత స్థాయి షాపింగ్‌, వినోద సౌకర్యాలు లభించడంతో పాటు, వేలకొద్దీ ఉద్యోగావకాశాలు కలుగనున్నాయి. విశాఖ, విజయవాడలో మాల్‌లు నిర్మించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ను ప్రముఖ రిటైల్ హబ్‌గా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు విజయవాడ నగర అభివృద్ధిలో మరో మైలురాయిగా నిలవనుంది.

Read Also : Local Body Elections : స్థానిక సంస్థల ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం?

Google News in Telugu Lulu Mall lulu mall vijayawada vizag

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.