📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం నేడు తూ.గో జిల్లాలో సిఎం పర్యటన నేడు AP TET హాల్ టికెట్స్ విడుదల ఆంధ్రా స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు నేడు పలు జిల్లాలకు వర్షసూచన ‘దిత్వా’ తుపాన్‌.. మరో రెండు రోజులు వర్షాలు

Jogi Ramesh Liquor Case: జోగి రమేష్‌కు బిగుస్తున్న ఉచ్చు

Author Icon By Sudheer
Updated: October 30, 2025 • 10:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇబ్రహీంపట్నం కల్తీ మద్యం కేసు రాజకీయంగా పెద్ద ఎత్తున వేడెక్కుతోంది. ఈ కేసులో వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి జోగి రమేష్ పేరు తెరపైకి రావడంతో రాష్ట్ర రాజకీయ వర్గాలు కదలికలోకి వచ్చాయి. సిట్‌ (Special Investigation Team) విచారణలో ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు సంచలన విషయాలు వెల్లడించారు. “జోగి రమేష్ చెప్పడంతోనే నకిలీ మద్యం తయారు చేశాను. ఆయన ఆర్థికంగా సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కానీ తరువాత నన్ను పూర్తిగా వదిలేశారు” అని ఆయన తెలిపినట్టు సమాచారం. అంతేకాకుండా జోగి రమేష్ సూచనల మేరకే “విషయం బయటకు లీక్‌ చేసి, రైడ్‌ జరిగేలా చేశాను” అని కూడా జనార్ధన్‌ రావు సిట్‌ అధికారుల ముందూ చెప్పినట్టు తెలుస్తోంది. ఈ వాంగ్మూలం కేసు దర్యాప్తులో కీలక మలుపుగా మారింది.

Latest News: Modi: బీహార్‌లో మోదీ ఘాటు విమర్శలు

సిట్‌ అధికారులు జనార్ధన్‌ రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌, ఆడియో-వీడియో రికార్డింగులు, లిఖిత పూర్వక వాంగ్మూలం అన్నీ సేకరించి, ఎక్సైజ్‌ విభాగం ద్వారా కోర్టుకు సమర్పించినట్లు సమాచారం. దీంతో కేసు రాజకీయంగా మరింత సున్నితంగా మారింది. అధికారులు ఇప్పటికే బహుళస్థాయి విచారణ చేపట్టారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా నెట్‌వర్క్‌, ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించారు. ఈ కేసుతో సంబంధమున్న వ్యాపారులు, రాజకీయ నాయకులు, స్థానిక అధికారులపై పలు కోణాల్లో విచారణ కొనసాగుతోంది. జనార్ధన్‌ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా మరికొంతమంది కీలక వ్యక్తులను కూడా సిట్‌ విచారణకు పిలిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా, మాజీ మంత్రి జోగి రమేష్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. “నాకు జనార్ధన్‌ రావు అనే వ్యక్తి అస్సలు తెలియదు. నకిలీ మద్యం కేసుతోనూ నా సంబంధం లేదు. ఇవన్నీ రాజకీయ కుతంత్రాలు” అని ఆయన స్పష్టం చేశారు. అయితే సోషల్ మీడియాలో జోగి రమేష్‌ మరియు జనార్ధన్‌ రావు కలిసి ఉన్నట్లు చెబుతున్న కొన్ని ఫోటోలు వైరల్‌ అవడంతో వివాదం మరింత ముదిరింది. ఈ ఫొటోలు నిజమా కాదా అన్నదానిపై సిట్‌ దర్యాప్తు కొనసాగిస్తోంది. మరోవైపు, రాష్ట్ర రాజకీయాల్లో ఈ కేసు వైసీపీకి ఇబ్బందికరంగా మారవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇబ్రహీంపట్నం ఘటన కేవలం మద్యం కేసు కాదని, ఇది రాజకీయ ప్రభావం ఉన్న పెద్ద నెట్‌వర్క్‌ బట్టబయలయ్యే అవకాశం ఉన్నదని వారు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Google News in Telugu jogi ramesh Latest News in Telugu Liquor Case SIT

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.