हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Telugu News: Maoist movement: మావోయిస్టు ఉద్యమానికి చుక్కెదురు

Pooja
Telugu News: Maoist movement: మావోయిస్టు ఉద్యమానికి చుక్కెదురు

చర్ల: గడిచిన ఏడాదిన్నర కాలంలో మావోయిస్టు ఉద్యమం మునుపెన్నడూ లేని విధంగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు రహిత దేశం చూస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నిజమవుతుందా అన్న సందేహాలు, చర్చలు మొదలయ్యాయి. తాజా పరిస్థితులు కేంద్ర కమిటీ సభ్యులపై కేంద్రీకరించిన ఆపరేషన్లతో ఉద్యమం నీరుగారుతోందని సూచిస్తున్నాయి.

ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో(encounter) కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి (కదారి సత్యనారాయణ రెడ్డి) మృతి చెందడం మావోయిస్టు ఉద్యమానికి భారీ దెబ్బగా మారింది. ఈ ఎన్‌కౌంటర్ కోవర్ట్ ఆపరేషన్‌లో భాగంగా జరిగిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత కేంద్ర కమిటీ స్థాయి నాయకులు మరణించడం ఇదే ప్రధమం.

Maoist movement

మావోయిస్టు చీఫ్ నంబాల కేశవరావు మృతి తర్వాత పార్టీ దిశా నిర్దేశం లోపించింది. ఇటీవల సోను పేరిట విడుదలైన లేఖలో ఆయన చర్చలకు సిద్ధమని వెల్లడించగా, అది వ్యక్తిగత అభిప్రాయమేనని పార్టీ చెబుతూ విభేదాలు బయటపెట్టింది. ఈ పరిస్థితి ఉద్యమం అంతర్గత సంక్షోభాన్ని మరింత స్పష్టంగా చూపిస్తోంది.

కోవర్ట్ ఆపరేషన్ల విజయాలు, మావోయిస్టుల గందరగోళం

ఇక, కోవర్ట్ ఆపరేషన్ల దెబ్బతో గత నెలరోజుల్లో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు మృతి చెందగా, ఒకరు లొంగిపోయారు. అగ్రనాయకత్వాన్ని ఏరివేస్తున్న భద్రతా వ్యవస్థ పనితీరుతో మావోయిస్టులలో తీవ్ర గందరగోళం(Extreme confusion) నెలకొంది. మరోవైపు పౌరసమాజం, మానవ హక్కుల సంఘాలు ఎన్‌కౌంటర్లపై ప్రశ్నించినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. “శరణమా.. మరణమా” అన్న కేంద్రం స్పష్టమైన సందేశం నేపథ్యంలో, మావోయిస్టులలో కొందరు లొంగుబాటుకే మొగ్గుచూపుతున్నారని సమాచారం.

ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఎవరు మృతి చెందారు?
ఛత్తీస్‌గఢ్ అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో కేంద్ర కమిటీ సభ్యుడు కట్టా రామచంద్రారెడ్డి (కదారి సత్యనారాయణ రెడ్డి) మృతి చెందారు.

మావోయిస్టు ఉద్యమానికి ఎందుకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి?
భద్రతా దళాలు కోవర్ట్ ఆపరేషన్ల ద్వారా అగ్రనాయకత్వాన్ని టార్గెట్ చేస్తుండటమే ప్రధాన కారణం.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870