📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

MPs salaries hike: ఎంపీల జీతాలు పెంచిన కేంద్రం

Author Icon By sumalatha chinthakayala
Updated: March 24, 2025 • 5:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

MPs salaries hike: దేశవ్యాప్యంగా ఎంపికైన ఎంపీల జీతాలు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇచ్చే లక్ష రూపాయల జీతాన్ని లక్షన్నరకు పెంచింది. జీతంతోపాటు మిగతా పెసిలిటీస్‌ కూడా పెంచుతున్నట్టు కేంద్రం పేర్కొంది. మాజీ ఎంపీలకు ఇచ్చే పింఛన్‌కూ పెంచుతున్నట్టు కేంద్రం వెల్లడించింది. 2023 ఏప్రిల్ నుంచి కొత్త శాలరీలు అమలులోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. దీని ప్రకారంశం ప్రతి ఎంపీకి రెండు ఏళ్ల బకాయిలు కూడా రానున్నాయి. ప్రస్తుతం ఒక్కో ఎంపీ లక్ష రూపాయలు జీతం తీసుకుంటున్నారు. ఆ జీతాన్ని లక్ష 24 రూపాయలకు పెంచారు. మాజీ ఎంపీలకు ఇచ్చే పాతికవేల రూపాయల పింఛన్‌ను 31 వేలకు పెంచారు.

రెండేళ్ల బకాయిలను కూడా కేంద్రం ఎంపీలకు చెల్లించనుంది

దీనికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ ఈరోజు (24-03-25) సోమవారం విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ప్రకారం 2023 ఏప్రిల్ 1 నుంచి కొత్త శాలరీలు అమలు అవుతాయి. అంటే రెండేళ్ల బకాయిలను కూడా కేంద్రం ఎంపీలకు చెల్లించనుంది. శాలరీలతోపాటు సభకు హాజరైతే ఇచ్చే డైలీ అలవెన్స్‌ కూడా పెంచింది. ఇప్పటి వరకు ఒక ఎంపీ సభకు హాజరైతే రోజుకు 2000 రూపాయలు ఇచ్చే వాళ్లు ఇకపై దాన్ని 2500కు పెంచారు. ఐదేళ్లకుపైగా సేవలు అందించిన ఎంపీలకు అదనంగా మరో 2000 రూపాయలు ఇచ్చే వాళ్లు. దాన్ని 2500కు పెంచారు. ఎంపీల శాలరీలు, ఇతర అలవెన్స్‌లు 2018లో ఒకసారి పెంచారు. మళ్లీ ఇప్పుడు పెంచారు. మొత్తం ఇప్పుడు 243 లోక్‌సభ, 245 రాజ్యసభ ఎంపీలకు వర్తించనుంది. వీళ్లతో పాటు గతంలో ఎంపీలుగా పని చేసిన మాజీలకు కూడా ఈ పెంపు మేరకు చెల్లింపులు చేస్తారు. పదవిలో ఉన్న ప్రతి ఎంపీకి ఈ శాలరీతోపాటు అదనంగా మరికొన్ని నిధులు కేంద్రం ఇస్తుంది. వారు ఎన్నికైన పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి ఖర్చుల కోసం నెలకు 70వేల రూపాయల అలవెన్స్‌ను కేంద్రం ఇస్తుంది. వీటితోపాటు స్టాఫ్‌, స్టేషనరీ, టెలిఫోన్ సహా ఇతర ఖర్చుల కోసం మరో 60000 రూపాయలు కూడా మంజూరు చేస్తోంది.

ప్రధానమంత్రికి, కేబినెట్ మంత్రులైన వాళ్లకు మరిన్ని వెసులుబాట్లు

ఇలా నిధులే కాకుండా ఎంపీతోపాటు భార్య లేదా భర్త ఏడాదిలో 34 సార్లు ఉచిత విమాన ప్రయాణం చేయవచ్చు. ఫస్ట్‌క్లాస్‌ ఏసీ కోచ్‌లో రైలు ప్రయాణం ఉచితం కూడా చేయవచ్చు. రోడ్డు రవాణాలో వెళ్తే కిలోమీటర్‌కు రూ.16 చొప్పున బిల్లు ఇస్తారు. ప్రైమ్‌ లోకేష్‌లో ఉండాలంటే అందుకు రెంట్‌ కూడా కేంద్రమే చెల్లిస్తుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉండి కేంద్రం నుంచి అద్దె తీసుకోకపోతే బిల్లులు పెట్టుకొని కేంద్రం నుంచి 2 లక్షల రూపాయల వరకు వసూలు చేసుకోవచ్చు. 50000 యూనిట్ల విద్యుత్‌ ఫ్రీ, 4వేల కిలోలీటర్ల తాగునీరు కూడా ఉచితంగా కేంద్రం అందిస్తుంది. పాథాలాజికల్‌ లాబొరేటరీ సౌకర్యం, ఈసీజీ, దంత, కంటి, చర్మ ఆరోగ్య సేవలు ప్రీగా పొందవచ్చు. మూడు టెలిఫోన్‌ కనెక్షన్‌లు ఉచితంగా వాడుకోవచ్చు. ఏడాదికి 50 వేల ఉచిత కాల్స్‌, స్మార్ట్‌ ఫోన్‌ ద్వారా 1.50 లక్షల కాల్స్‌ మాట్లాడుకునే వీలు కల్పిస్తుంది కేంద్రం. ప్రధానమంత్రికి, కేబినెట్ మంత్రులైన వాళ్లకు మరిన్ని వెసులుబాట్లు ఉంటాయి. ప్రధానమంత్రిగా ఎన్నికైన వ్యక్తికి ఎంపీ కోటాలో వచ్చే నిధులు, ఇతర సౌకర్యాలతోపాటు అదనంగా నెలకు 3వేల అదనపు అలవెన్స్‌ వస్తుంది. కేంద్రమంత్రులకు నెలకు రెండు వేలు, సహాయ మంత్రులకు వెయ్యి రూపాయలు ఇస్తారు. ఇలా ఎంపీల జీతాలను ప్రతి ఐదేళ్లకు పెంచాలని 2023 ఏప్రిల్ 1ని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు పెంచినట్టు ఇప్పుడు గెజిట్‌నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.

Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu MPs Paper Telugu News Salaries increased Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.