తెలుగు సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat)కు ఇండస్ట్రీ నుండి సాయం అందలేదన్న విమర్శలపై నిర్మాత నట్టి కుమార్ ఘాటుగా స్పందించారు. ‘‘వెంకట్ సినీ ఇండస్ట్రీలో చిన్న పాత్రలతో ప్రస్థానం మొదలుపెట్టారు. నెలకు మూడు వేల రూపాయలు తీసుకునే స్థితిలో నుంచి 30 వేల రూపాయల వరకు పారితోషికం పొందే స్థాయికి ఎదిగారు. డబ్బు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని చెబుతున్నారు’’ అని అన్నారు.
MAA సభ్యత్వం లేకపోవడమే ప్రధాన కారణం
వెంకట్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సభ్యుడు కాకపోవడం వల్లే ఇండస్ట్రీ నుంచి అధికారికంగా సాయం అందించలేదని నట్టి కుమార్ (Natti Kumar) పేర్కొన్నారు. ‘‘వెంకట్ ఎప్పటికీ MAA సభ్యత్వం తీసుకోలేదు. సభ్యత్వం లేనివారిని మేము గుర్తించి సహాయం చేయలేం. ఎవరైనా సభ్యులై ఉంటే, ఆపదలో ఉన్నప్పుడు ఇండస్ట్రీ వారు ముందుకు వచ్చేవారు. ఇది ఒక వ్యవస్థతో నడిచే సంస్థ’’ అని వివరించారు.
సంబంధాలున్నవారికే సెలబ్రిటీలు స్పందిస్తారు
ఫిష్ వెంకట్‌తో వ్యక్తిగతంగా సంబంధాలున్నవారే అతడిని పరామర్శిస్తారని, అందులో తప్పులేదని నట్టి కుమార్ అభిప్రాయపడ్డారు. ‘‘రేపు నా పరిస్థితి కూడా అలాగే అయిందన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఇండస్ట్రీలో సంబంధాలున్నవారికే గుర్తింపు ఉంటుంది. అందుకే ప్రతీ ఒక్కరూ తమ భవిష్యత్తును ముందుగానే సురక్షితంగా చూసుకోవాలి’’ అని హితవు పలికారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి.
Read Also : Khammam: గుట్టల్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం