📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

TG: ఇ.వి. పాలసీతో ఇప్పటివరకు లక్షదాక వాహనాల విక్రయం

Author Icon By Saritha
Updated: January 7, 2026 • 10:41 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ : (TG) రాష్ట్రంలో ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేసిన జీవో 41 మూలంగా ఇప్పటి వరకు లక్షకి పైగా ఎలక్ట్రిక్(ఈవి) వాహనాలు అమ్ముడుపోయాయని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. ఈవి వాహనాలను ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం సబ్సిడి. ఇవ్వాలని కంపెనీలకి సూచించామన్నారు. మంగళవారం అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఈవి వాహనాల అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవాణా, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానమిచ్చారు. ఈవి పాలసీ ద్వారా రాబోయే తరానికి మంచి జీవితం ఉండడానికి జీవో 41 ద్వారా ఈవి పాలసీ తీసుకొచ్చామన్నారు. సంవత్సర కాలంలో లక్ష ఈవి వాహనాలు అమ్ముడు పోయాయన్నారు. ఈవి వాహనాలు గతంలో ఒకసారి ఛార్జింగ్ చేస్తే 150 కిమీ కెపాసిటీ ఉండేవని.. ఇప్పుడు 500 కిమీ వచ్చే కెపాసిటీ వచ్చిందని… దానిని మరింత పెంచడానికి రివ్యూస్ జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చార్జింగ్ స్టేషన్లను పెంచడానికి, కార్యాలయాలు, గ్రేటర్ కమ్యూనిటీ హాల్లు, విద్యాలయాల వద్ద కూడా ఏర్పాటు చేయాలని చర్యలు జరుగుతున్నాయన్నారు.

Read also: BRS : ఉద్యమ పార్టీతో తెగిపోయిన కవిత బంధం..నెక్స్ట్ ఏంటి ?

ప్రభుత్వ ఉద్యోగులకు ఈవి కొనుగోలుపై 20 శాతం సబ్సిడీ

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు కొనుగోలు చేస్తే 20 శాతం సబ్సిడీ విద్యుత్ వాహనాలకు ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫ్రీ శాసనసభలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు డీలర్లతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశామని, ఈవి పాలసీ కోసం ప్రోత్సాహం ఇవ్వడానికి ప్రభుత్వం నుండి దాదాపు 900 కోట్ల రూపాయలు నష్టం జరిగినప్పటికీ పాలసీ అమలు చేస్తామన్నారు. (TG) ప్రభుత్వ ఉద్యోగులు ఈవి వాహనాలు కొంటే 20 శాతం మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. రెడ్కో సంస్థల ద్వారా ఛార్జింగ్ స్టేషన్ లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వాహ నాలు, పాఠశాల బస్సులు, ఫార్మా, ఐటీ వాహనాలు 25 శాతం నుంచి 50 శాతం వారి అవసరాలు బట్టి ఈవీ వాహనాలు కొనేలా విధానం తీసుకురాబోతున్నామని మంత్రి సభలో చెప్పారు. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూస్తే అక్కడ గాలిలో డేంజరస్ బ్యాక్టరీ ఉన్నట్లు తెలుస్తుందన్నారు. హైదరాబాద్లో అలాంటి పరిస్థితి రాకుండా ఉండడానికి ఈవి పాలసీ ద్వారా ఈవి వాహనాలు, సిఎన్కీ, ఎల్పిజి వాహనాల వినియోగం పెంచుతున్నామన్నారు. తెలంగాణ లో 9 వేలకు పైగా బస్సులు ఉన్నాయి. పిఎం-ఈ డ్రైవ్ కింద తెలంగాణలో 500 బస్సులు తిరుగుతున్నాయన్నారు.

హైదరాబాద్‌కు దశలవారీగా 2800 ఈ-బస్సులు

హైదరాబాద్ కు పీఎం ఈ డ్రైవ్ కింద 2800 బస్సులు దశల వారీగా వస్తున్నాయన్నారు. వరంగల్ మున్సిపాలిటీ 100, నిజామాబాద్ మున్సి పాలిటీ 50 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయన్నారు. ప్రభుత్వ వాహనాల్లో కూడా 20 నుండి 30 శాతం ఈచి వాహనాలు వాడేలా కార్యాచరణ తీసుకుంటుందన్నారు. 15 సంవత్సరాల పైబడిన వాహనాలకి స్క్రాప్ పాలసీ తీసుకొచ్చామని, గతంలో స్క్రాప్ పాలసీ లేదన్నారు. అర్టిసిలో డీజిల్ బస్సుల స్థానంలో రెట్టిరోసిట్ చేసి ఎలక్ట్రిక్ బస్సులుగా మారుస్తున్నామన్నారు. ఆటోలు కూడా డీజిల్ వాహనాలు అనేక పెండింగ్ సమస్యలు కనిపించకుండా రెట్టిరోఫిటికి అవకాశం ఇచ్చామన్నారు. ఎల్బిజి, సిఎన్జ, ఈవి ఆటోలు, రేటిరోఫిట్ ఆటోలకు అనుమతి ఇచ్చామన్నారు. గేటెడ్ కమ్యూనిటీలో ఛార్జింగ్ స్టేషన్లు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ చార్జింగ్ స్టేషన్ లు, రెడ్కో ద్వారా చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

అలాగే అన్ని కలెక్టరేట్లు, రెస్టారెంట్లు, టూరిజం స్పాట్లలో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. (TG) ఈవి వాహనాల వినియోగం దేశంలోనే తెలంగాణ రోల్ మోడల్ గా ఉండాలన్నారు. ఆర్టీసిలో పరిష్కరించాం.. గత ప్రభుత్వం చేసిన విలీన అంశానికి సంబంధించి ఒకటి.. కార్మిక సంఘాల రద్దుపై పాలసీపై త్వరలోనే మార్గదర్శకత్వం వస్తుందన్నారు. ఆర్టీసిలో యూనియన్ బ్యాంక్ కలిసి ఉద్యోగులు ఎవరైనా చనిపోతే కోటి రూపాయలు నష్టపరిహారం ఇచ్చే విధంగా కొనసాగిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం ఒక్క కొత్త బస్సు కొనుగోలు చేయలేదని, ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. తమ ప్రజా ప్రభుత్వం కొత్త బస్సులు కొనుగోలు చేస్తుందని, ఉద్యోగాలు ఇస్తుంది సంస్థ అప్పుల సంఖ్యను పూర్తిగా తగ్గించిందన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:


ChargingStations ElectricVehicles EVBuses EVInfrastructure EVPolicy EVSubsidy GO41 Latest News in Telugu TelanganaEV Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.