📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

TG Criminal Act: నూతన క్రిమినల్ చట్టాల అమలుపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి సమీక్ష

Author Icon By Ramya
Updated: July 9, 2025 • 11:01 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

TG Criminal Act: హైదరాబాద్: దేశ వ్యాప్తంగా ఏడాది క్రితం అమల్లో వచ్చిన నూతన క్రిమినల్ (TG Criminal Act) చట్టాలు తెలంగాణలో ఏ విధంగా అమలవుతున్నాయనే దానిని పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ ప్రత్యేక ప్రతినిధుల బృందం మంగళవారం నాడు హైదరాబాద్కు విచ్చేసింది. ఈ సందర్భంగా ఈ బృందం రాష్ట్ర ఉన్నతాధికారులతో భేటీ అయ్యింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్లో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, రాష్ట్ర చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి రవి గుప్తా, డిజిపి జితేందర్, సిటీ కొత్వాల్ ఆనంద్ సహా కేంద్ర హోంశాఖ తరపున జాయింట్ సెక్ర టరీలు, ఎన్ఎ ఆర్బి, బిపిఆర్ అండ్ బి, ఎన్ఐఐసి విభాగాల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రహోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ (Govind Mohan) రాష్ట్రంలో నూతన క్రిమినల్ చట్టాల అమలుగురించి డిజిపి జితేందరన్ను అడిగి తెలుసుకున్నారు. ఐపిసిల స్థానంలో వచ్చిన కొత్త చట్టాల అమలులో ఎక్కడా ఇబ్బందులు లేకుండాచూడాలని ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ఉన్నతాధికారులను కోరారు. అనంతరం డిజిపి జితేందర్ (DGP Jitender) మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన క్రిమినల్ చట్టాల అమలు పక్కాగా జరుగుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన అందించారు. దీంతో పాటు తెలంగాణ పోలీసులు ఇటీవల కాల ంలో సాధించిన విజయాలను డిజిపి కేంద్ర హోం శాఖ ప్రతినిధుల బృందానికి వివరించారు. దీంతో పాటు రాష్ట్ర పోలీసు కేడర్కు సంబంధించిన వివరాలు శాంతి భద్రతల నిర్వహణ, ఇటీవల కాలంలో భద్రతకు సంబంధించి పలు అంశాలలో పోలీసు శాఖకు ఎదురైన సవాళ్లను ఎలాఅధిగమించామనే దానిపైనా డిజిపి జితేందర్ వివరించారు.

భారతదేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు?

భారతదేశంలో 2023లో క్రిమినల్ చట్టాలలో సంస్కరణలకై మూడు కొత్త చట్టాలు తీసుకొచ్చారు — భారత న్యాయ స్మృతి, భారత సాక్ష్య చట్టం, భారత శిక్షా స్మృతి. ఇవి 2024 జులై 1 నుండి అమల్లోకి వచ్చాయి.

పాత క్రిమినల్ చట్టాలు మరియు కొత్త క్రిమినల్ చట్టాలు మధ్య తేడా ఏమిటి?

పాత క్రిమినల్ చట్టాలు బ్రిటిష్ కాలంలో రూపొందించబడినవి, శిక్షలపైనే ఎక్కువగా దృష్టి సారించేవి. కొత్త చట్టాలు బాధితుల హక్కులకు ప్రాధాన్యం ఇస్తూ, ఫాస్ట్ ట్రాక్ న్యాయం కోసం మౌలిక మార్పులు చేయబడ్డాయి.

Read hindi news: hindi.vaartha.com/

Read also:  Meenakshi Natarajan: జూబ్లీహిల్స్ ఆశావహుల్లో యమ టెన్షన్

Breaking News CentralHomeDepartment CommandControl GovindMohan latest news LawEnforcement New Criminal Laws Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.