हिन्दी | Epaper
11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం 11 నెలల్లో టీటీడీకి రూ.918.59 కోట్ల విరాళాలు శ్రీవారి భక్తులకు శుభవార్త టిటిడిలో సింఘాల్ మార్కుపాలన కర్వా చౌత్ ఉపవాస నియమాలు టిటిడి క్యాలండర్లు డైరీలు వైకుంఠ ద్వార దర్శనం శబరిమల గోల్డ్ మాయం

High alert : ఉగ్ర దాడి.. తిరుమలలో హై అలెర్ట్..!

sumalatha chinthakayala
High alert : ఉగ్ర దాడి.. తిరుమలలో హై అలెర్ట్..!

High alert : తిరుమలలో హై అలర్ట్ ప్రకటించారు. కొండపై భద్రతను విజిలెన్స్ సిబ్బంది కట్టుదిట్టం చేశారు. జమ్మూకాశ్మీర్‌లోని పహల్గాంలో ఉగ్ర దాడి జరగడంతో ముందస్తు జాగ్రత్తగా తిరుమలలో కూడా టీటీడీ సెక్యూరిటీ కట్టుదిట్టం చేస్తోంది. తిరుమల ఘాట్ రోడ్డులోని లింక్ రోడ్డు సమీపంలో వాహనాలను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది తనిఖీ చేస్తున్నారు. అనుమానం వచ్చిన వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వచ్చే అన్ని వాహనాలను, భక్తులను క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

 ఉగ్ర దాడి తిరుమలలో హై అలెర్ట్

అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు

మొదట అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు ఘాట్ రోడ్డులో పలుచోట్ల ఆర్టీసీ బస్సులను ఇతర ప్రైవేటు వాహనాలను, అందులోని లగేజీని సైత తనిఖీ చేశారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు టీటీడీ చెబుతోంది. శ్రీవారి ఆలయ పరిసరాలలోనూ భద్రతను నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. నిఘవర్గాల హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ యంత్రాంగం తిరుమల కూడా భద్రత కట్టుదిట్టం చేసింది చెబుతున్నారు.

సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు

తిరుమలకు అలిపిరి మీదుగా వాహనాలతో పాటుగా కాలినడకన వచ్చే రెండు మార్గాలు ఉన్నాయి. అలాగే శ్రీవారి మెట్టు నడకమార్గం ఉంది. తిరుమలకు వాహనాల్లో వెళ్లే భక్తుల లగేజీని అలిపిరి సప్తగిరి చెకింగ్ పాయింట్ దగ్గర తనిఖీలు చేస్తారు. అలిపిరి, శ్రీవారి మెట్టు నడకమార్గంలో వెళ్లే భక్తుల లగేజీని కూడా చెక్ చేసిన తర్వాతే అనుమతిస్తారు. ప్రస్తుతం తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండటం, కాశ్మీర్ ఉగ్రదాడితో తిరుమలలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలను ముమ్మరం చేశారు. ముందస్తు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకుంటున్నారు విజిలెన్స్ అధికారులు.

Read Also: మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870