📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి అన్నీ ఇక ఇ- ఫైళ్లే.. విద్యార్థుల భద్రతపై అధికారులకు సీఎం వార్నింగ్ విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్ పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి

Polavaram–Banakacherla : పోలవరం-బనకచర్లకు నెలఖారులోపు టెండర్లు – సీఎం చంద్రబాబు

Author Icon By Sudheer
Updated: June 6, 2025 • 11:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్‌(AP)లో కీలకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు (Polavaram–Banakacherla Project ) పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టుకు అవసరమైన అటవీ, పర్యావరణ అనుమతులు త్వరగా పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూసేకరణ ప్రక్రియ కూడా ముందుగానే సిద్ధంగా ఉండాలన్నారు. ఈ నెలాఖరులోపు టెండర్లను పిలవాలనే దిశగా పూర్తి ప్రణాళికను రూపొందించాలన్నారు.

రూ.81,900 కోట్ల వ్యయంతో ప్రాజెక్ట్ నిర్మాణం

ఈ ప్రాజెక్ట్ మొత్తం రూ.81,900 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఈ భారీ ప్రాజెక్ట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారం, విదేశీ ఆర్థిక సంస్థల నుండి రుణాల ద్వారా నిధులు సమకూరనున్నాయి. ఇందులో 50% నిధులు విదేశీ ఆర్థిక సంస్థల (EAP) ద్వారా రుణంగా, 20% కేంద్రం గ్రాంట్ రూపంలో, 10% రాష్ట్ర ప్రభుత్వం ఈక్విటీ రూపంలో, మరో 20% హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) విధానంలో ఉంటాయని తెలిపారు.

దక్షిణాంధ్ర ప్రాంతాలకు ఇది జీవనాడి

ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలోని సాగునీటి అవసరాలపై పెద్ద ఎత్తున భారం తీరుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా రాయలసీమ, దక్షిణాంధ్ర ప్రాంతాలకు ఇది జీవనాడిగా మారే అవకాశముందని అన్నారు. తాగునీరు, సాగునీరు అవసరాలను తీరుస్తూ రాష్ట్రం వ్యవసాయ ప్రగతికి మార్గం సుగమం చేయగల ఈ ప్రాజెక్టుకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టంగా చెప్పారు.

Read Also : Surya: ‘వాడివాస‌ల్’ నుంచి త‌ప్పుకున్న సూర్య ఎందుకంటే?

polavaram banakacherla project

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.