Tummala Nageswara Rao-రాష్ట్రంలో యూరియా(Urea) పంపిణీలో ఎటువంటి సమస్యలు, ఘర్షణలకు తావులేకుండా పగడ్బందీ చర్యలు చేపట్టినట్లు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో క్యూ లైన్స్లో తోపులాటలు లేకుండా అదనంగా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు.
దేశవ్యాప్తంగా యూరియా కొరత – తెలంగాణ చర్యలు
గత కొద్ది రోజులుగా యూరియా పంపిణీలో తలెత్తిన సమస్యలు పునరావృతం కాకుండా రైతు వేదికల వద్ద కూడా యూరియా పంపిణీ చేపట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు జరిపేందుకు వీలుగా రెండు రోజుల వ్యవధిలో 500 ఇపిఒఎస్ మిషన్లు తెప్పించి, సిబ్బందికి శిక్షణ ఇప్పించి యూరియా అమ్మకాలు చేపట్టడం జరిగిందన్నారు. రైతులకు ముందుగానే టోకెన్లు జారీ చేసి క్యూ లైన్లు లేకుండా తోపులాటలు లేకుండా యూరియా పంపిణీ సజావుగా జరుపుతున్నట్లు చెప్పారు.
యూరియా పంపిణీ పై వ్యవసాయ శాఖ(Department of Agriculture) కార్యాలయంలో డైరెక్టర్ గోపి నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. డిమాండ్కు తగ్గట్లుగా తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో యూరియా సరఫరాలో కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. గత నెలలో అదనంగా 40 వేల టన్నుల యూరియా తెచ్చుకున్నామని, ఇకమీదట ప్రతిరోజు 10 వేల టన్నులు వివిధ కంపెనీలు సరఫరా చేస్తుండటంతో పంపిణీ మెరుగు పడిందన్నారు. అయితే కొన్ని పార్టీలు రాజకీయ స్వార్థంతో యూరియా పంపిణీ కేంద్రాల వద్ద కావాలని ఆందోళనలు చేసి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే దిగజారుడు రాజకీయం చేస్తున్నారని, వారి పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
యూరియా పంపిణీ కోసం ఏ విధమైన చర్యలు తీసుకున్నారు?
రాష్ట్రవ్యాప్తంగా 500 రైతు వేదికల వద్ద యూరియా అమ్మకాలు ఏర్పాటు చేసి, ఇపిఒఎస్ మిషన్లు తెప్పించి, టోకెన్ విధానం అమలు చేస్తున్నారు.
యూరియా కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఏం చేసింది?
గత నెలలో అదనంగా 40 వేల టన్నుల యూరియా తెప్పించారు. ఇకపై ప్రతిరోజూ 10 వేల టన్నులు కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Read also: