📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Elections-ప్రారంభమైన ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్

Author Icon By Pooja
Updated: September 9, 2025 • 11:10 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Elections-నేడు (మంగళవారం) ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్(Elections Polling) జరుగుతుంది. ఉదయం 10గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5వరకు కొనసాగనుంది. పార్లమెంటు నూతన భవనంలోని ‘ఎఫ్-101 వసుధ’లో పోలింగ్ జరగనుంది. 6 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రికి విజతను ప్రకటిస్తారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా సి.పి.రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తలపడనున్నారు.

పోలింగ్ లో పాల్గొనని బీఆర్ఎస్, బిజెడి

పార్లమెంటు ఉభయసభలకు ప్రాతినిధ్యం వహించే మొత్తం సంఖ్య 788 అయినప్పటికీ ఏడు స్థానాలు ఖాలీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే ఉన్నారు. అయితే పోలింగ్ లో పాల్గొనడం లేదని బీఆర్ఎస్, ఆర్ జెడి ప్రకటించాయి. దీనిప్రకారం 386ఓట్లు దక్కించుకున్నవారు విజేతగా నిలవనున్నారు. ప్రతిపక్ష కూటమి అభ్యర్థి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డికి 314 మంది ఎంపీల మద్దతు ఉంది. దీంతో ఎన్టీయే అభ్యర్థి గెలుపు దాదాపు ఖాయమనే చెప్పాలి. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య ఓటింగ్ ద్వారా ఓకే బదిలీ ఓటు ద్వారా దామాషా ప్రతినిధ్యవ్యవస్థకు అనుగుణంగా పార్లమెంటు ఉభయసభల(Both Houses of Parliament) సభ్యులందరితో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఒకసారి ఎన్నుకోబడిన వైస్ ప్రెసిడెంట్ ఐదేళ్ల పదవీకాలం పాటు పదవిలో కొనసాగుతారు. 2024 వరకు 14మంది ఉపాధ్యక్షులుగా పనిచేసారు.

భారత తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాక

ష్ణన్ 1952 మే 13న రాష్ట్రపతి భవన్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఎం.వెంకయ్యనాయుడు పదవి కాలం ముగిసిన తర్వాత 2022 ఆగస్టు 11న 14వ ఉపాధ్యక్షుడిగా జగదీష్ ధశేఖర్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆయన పదవి ఇంకా రెండు సంవత్సరాలు ఉండగానే తన పదవికి రాజీనామా చేయడంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. రెండు ప్రధాన కూటముల ఎంపీలు ఒకొక్కక్కరుగా పార్లమెంటు నూతన భవనంలోని ఎఫ్-101 వసుధలోకి చేరుకుంటున్నారు. ప్రధాని మోదీ ఎన్డీయే తరపున తొలి ఓటు వేశారు. సాయంత్రం ఐదుగంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరు ఓటు వేయగలరు?
లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరూ ఓటు వేయగలరు.

మొత్తం ఎంతమంది ఎంపీలు ఓటు వేస్తారు?
మొత్తం 788 మంది ఎంపీలు ఓటు వేసే అవకాశం ఉంది.

Read hindi news:hindi.vaartha.com

Read also:

https://vaartha.com/telugu-news-balapur-money-rains-for-balapur-ganesha/hyderabad/543660/

Google News in Telugu Latest News in Telugu Lok Sabha Vice President Election Parliament Vice President Election Rajya Sabha Vice President Election Telugu News Today vice president election india Vice President Polling 2025

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.