📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Telugu News: Crime News-నైజీరియాలో మారణహోమం.. 50మంది మృతి

Author Icon By Pooja
Updated: August 21, 2025 • 12:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Crime news: మతం మానవత్వాన్ని ప్రదర్శించమని బోధిస్తుంది. తోటివారిని ప్రేమించమని చెబుతుంది. నీ పొరుగువారికి ఏ కీడు తలపెట్టవద్దని హితోపదేశంచేస్తుంది. మతం పేరుతో హత్యలకు పాల్పడితే అది మతం కాదు, మతం ముసుగులో మృగాలు చేసే చర్యగా చెప్పకతప్పదు. ప్రార్థనలు చేసుకుంటున్న అమాయకులపై కాల్పులకు తెగబడి, 50 మందిని హతమార్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. నైజీరియాలో(Nigeria) మంగళవారం మసీదుపై దాడి జరిగింది. ఉంగుటాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 50 మందికి చేరింది. అంతేకాదు దాదాపు 60 మందిని బందీలుగా తీసుకెళ్లారు. మసీదులో ప్రార్థనలు చేస్తుండగానే దుండగులు ఈ దాడులకు
పాల్పడినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అంతేకాదు దుండగులు పలు గ్రామాలపై కూడా దాడులకు పాల్పడ్డారని చెప్పారు. ఇది ఉగ్రవాదుల పనేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ దాడికి తామే పాల్పడినట్లు ఇప్పటివరకు ఏ సంస్థ ప్రకటించలేదు.

Crime News

అంతర్గత పోరులో నలిగిపోతున్న ప్రజలు

పకాగా నైజీరియాలో గతకొంతకాలంగా జాతులమధ్య విభేదాలతో(ethnic differences) తరచూ ఘర్షణలు జరుగుతున్నాయి. అంతేకాక స్థానికంగా ఏర్పడ సాయుధ ముఠాలు పలు అరాచకాలకు పాల్పడుతున్నాయి. 2022వ సంవత్సరంలో నైజీరియాలోని కట్సినా రాష్ట్రంలో ఒక మసీదుపై దాడి జరిగింది. ఆ దాడిలో ఇమామ్తో సహా 12మంది మరణించారు. సాయుధ ముఠాలు డబ్బు కోసం కిడ్నాప్ లు, దోపిడీలకు పాల్పడడం సర్వసాధారణంగా పరిణమించింది. ఇక్కడి
ప్రభుత్వాలు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా ఈ ముఠాల ఆగడాలు తగ్గడం లేదు.

బోకో హరామ్, ఇస్లామిక్ సంస్థల దాడులు కాగా నైజీరియాలో బోకో హరామ్,(Boko Haram,) ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ వంటి తీవ్రవాద సంస్థలు ఎక్కువగా మసీదులపై దాడులు చేస్తుంటాయి. ఈ ఉగ్రవాదులు కరుడుగట్టిన నేరస్తులు. వీరికి ఏకొననా మానవత్వం అనేది ఉండదు. వారి సిద్ధాంతాలను వ్యతిరేకించే ముస్లింలపై ఏమాత్రం మానవత్వాన్ని చూపకుండా ఇలాంటి దాడులకు పాల్పడుతుంటాయి. తమకు అనుగుణంగా లేని ప్రార్ధనా స్థలాలు, ప్రజలను వాళ్లు టార్గెట్ చేసి దాడులు చేస్తుంటారు. భద్రతా దళాలు, ప్రభుత్వం తమకు వ్యతిరేకంగా కార్యక్రమాలను తలపెట్టినా ఉగ్రవాదులు ఇలాంటి ప్రతీకార దాడులకు పాల్పడుతుంటారు. ప్రస్తుతం బంధీలుగా
తీసుకెళ్లిన తమ వారిని విడిపించాలని బంధువులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఇది మతపరమైన దాడేనా?

ఈ దాడి మసీదులో ప్రార్థనలు చేస్తున్న సమయంలో జరగడం, గత ఉదాహరణలు చూస్తే, ఇది మతపరమైన ఆవేశంతో కూడిన ఉగ్రవాద చర్ అయి ఉండే అవకాశం ఉంది. కానీ ఈ దాడికి స్పష్టమైన ఉద్దేశ్యం ఇంకా తెలియాల్సి ఉంది.

నైజీరియాలో ఇలాంటి దాడులు తరచూ జరుగుతుంటాయా?

అవును. నైజీరియాలో జాతి, మత విభేదాలు, ఉగ్రవాద గుంపుల ఉనికి కారణంగా ఇలాంటి దాడులు తరచూ జరుగుతుంటాయి. 2022లో కూడా కట్సినా రాష్ట్రంలో మసీదుపై దాడి జరిగింది, అందులో 12 మంది మృతి చెందారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ MORE:

https://vaartha.com/telugu-news-crime-news-five-members-of-a-family-commit-suicide-in-hyderabad/hyderabad/533588/

50attacked ethinic differences Google News in Telugu Latest News in Telugu Mosque attack Nigeria Religionclashes Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.